Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

BIG BREAKING: ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం.. అనుకూలంగా 15 మంది డైరెక్టర్లు..!

BIG BREAKING: ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం.. అనుకూలంగా 15 మంది డైరెక్టర్లు..!

నల్లగొండ, మనసాక్షి :

బి ఆర్ఎస్ కు చెందిన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పై డైరెక్టర్లు పెట్టిన అవి విశ్వాస తీర్మానం నెగ్గింది. శుక్రవారం డిసిసిబి కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ లో అవిశ్వాసానికి అనుకూలంగా 15 మంది డైరెక్టర్లు చేతులెత్తాడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది.

మొత్తం 19 మంది డైరెక్టర్లు గాను 15 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతించారు . తాత్కాలిక చైర్మన్ గా వైస్ చైర్మన్ దేశ రెడ్డి దయాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. జూలై 1న డిసిసిబి చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన దగ్గర నుండి సుమారు 18 రోజులపాటు 15 మంది డైరెక్టర్లను చైర్మన్ పదవి ఆశిస్తున్న మునుగోడు డైరెక్టర్ కుంభం శ్రీనివాస్ రెడ్డి కేరళ రాష్ట్రంలో క్యాంపు తరలించారు. నేడు జరిగిన సమావేశానికి నేరుగా డైరెక్టర్లు బ్యాంకు చేరుకొని అవిశ్వాస తీర్మానంలో పాల్గొని ఓటింగ్ చేశారు.

క్యాంపు నుంచి నేరుగా ఓటింగ్ కు వచ్చిన డైరెక్టర్లు

 

ఈ సందర్భంగా కుంభం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానం నెగ్గిందని కాంగ్రెస్ పార్టీ డిసిసిబి చైర్మన్ పదవిని దక్కించుకుంటుందని తెలిపారు. గొంగిడి మహేందర్ రెడ్డి చైర్మన్ గా చేసిన అవినీతి అక్రమాలకు నేటితో పుల్ స్టాప్ పదిన్దన్నారు. గొంగడి మహేందర్ రెడ్డి ఎన్నడు కూడా డైరెక్టర్ల సలహాలు సూచనలు తీసుకోలేదని ఒంటెద్దు పోకడలేక పోయాడన్నారు. బ్యాంకుకు పట్టిన చీడ వదిలిందని త్వరలోనే నూతన చైర్మన్ ను ఎన్నుకుంటారన్నారు.

ALSO READ :

Swarnagiri : ఏ నోట విన్నా స్వర్ణగిరి దేవాలయమే.. ప్రత్యేకతలు ఏంటో మీరూ చూడండి..!

WhatsApp : ఆ 35 ఫోన్లకు వాట్సప్ సేవలు బంద్.. జాబితాలో మీ ఫోన్ ఉందా.. చూసుకోండి..!

Cm Revanth Reddy: నన్ను తప్పించండి.. సోనియా, రాహుల్ గాంధీలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి..!

మరిన్ని వార్తలు