NARAYANPET : నారాయణపేట జిల్లాలో 30, 30 (ఎ) పోలీసు యాక్ట్ అమలు..!
NARAYANPET : నారాయణపేట జిల్లాలో 30, 30 (ఎ) పోలీసు యాక్ట్ అమలు..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని ఈ నెల రోజుల ( జులై 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తం గా 30,30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్.పి. యోగేష్ గౌతమ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు అధికారులకు ముందస్తు అనుమతి లేకుండా జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిదులు, వివిధ సంఘాలు ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపినారు.
అలాగే ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా మరియు ప్రజా ధనానికి, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్.పి. హెచ్చరించారు. కాబట్టి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసు వారికి ఇట్టి విషయంలో సహకరించాలని ఎస్పీ తెలిపారు.
ఎలాంటి అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తుల పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
ALSO READ :
Rythu Bharosa : రైతు భరోసాకు పరిమితులు విధించాలి.. అభిప్రాయ సేకరణలో రైతుల వెల్లడి.!









