Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : తెలంగాణ సాయుధ పోరాటం అనగానే గుర్తుకొచ్చేది దొడ్డి కొమరయ్య.. అదనపు కలెక్టర్ శ్రీనివాస్..! 

Nalgonda : తెలంగాణ సాయుధ పోరాటం అనగానే గుర్తుకొచ్చేది దొడ్డి కొమరయ్య.. అదనపు కలెక్టర్ శ్రీనివాస్..! 

నల్లగొండ, మనసాక్షి :

దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా గురువారం అదనపు కలెక్టర్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ భూమికోసం, భుక్తి కోసం చేసిన పోరాటం కాలక్రమేనా తెలంగాణ సాయుధ పోరాటానికి దారితీసిందని, ఈ పోరాటంలో ప్రాణాలను కోల్పోయిన దొడ్డి కొమరయ్య తెలంగాణ సాయుధ పోరాటానికి ఆద్యుడిగా నిల్చాడని అన్నారు.

అలాంటి మహానుభావుల త్యాగాల ఫలితమే తెలంగాణ అని అన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి డి. రాజ్యలక్ష్మి, హౌసింగ్ పీడీ, జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఇంచార్జి అధికారి రాజ్ కుమార్, కలెక్టరేట్ ఏ ఓ మోతిలాల్, ఇతర అధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని దొడ్డి కొమరయ్యకు నివాళులు అర్పించారు.

ALSO READ : 

WhatsApp : కొత్త టెక్నాలజీ పై ఫోకస్ పెట్టిన వాట్సప్.. మరో రెండు కొత్త ఫీచర్లు..!

TS EAPSET 2024 Counselling : తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రారంభం.. ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి..!

మరిన్ని వార్తలు