Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESటెక్నాలజీతెలంగాణవిద్య

TS EAPSET 2024 Counselling : తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రారంభం.. ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి..!

TS EAPSET 2024 Counselling : తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రారంభం.. ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి..!

Mana Sakshi:

TS EAPCET 2024 : తెలంగాణ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ గురువారంతో ప్రారంభమైంది. మొదటి దశ కౌన్సిలింగ్ కోసం ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు స్లాట్ బుకింగ్స్ చేసుకునే అవకాశం ఉంది. మొదటి విడతలో స్లాట్ బుకింగ్ చేసుకుంటే 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. ఆ తర్వాత 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 19వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఆ తర్వాత 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఫీజు చెల్లించి కళాశాలలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.

అదేవిధంగా ఇక రెండవ విడత 19వ తేదీ నుంచి 26వ తేదీన స్లాట్ బుకింగ్, 27వ తేదీన సర్టిఫికెట్ల పరిశీలన, 27, 28వ తేదీలలో వెబ్ ఆప్షన్ల నమోదు. 31 వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆ తర్వాత 31వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు ఫీజు చెల్లించి కళాశా లలో రిపోర్టు చేయాలి.

ALSO READరైతు వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసిల్దార్..! 

అదేవిధంగా చివరి దశ కౌన్సెలింగ్ ఆగస్టు 8వ తేదీన స్లాట్ బుకింగ్ చేసుకున్న విద్యార్థుల సర్టిఫికెట్ తొమ్మిదో తేదీన పరిశీలిస్తారు. 9, 10 తేదీలలో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకుంటే 13వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. అనంతరం 13 నుంచి 17వ తేదీ వరకు ఫీజు చెల్లించి కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

ఈ మూడు దశల్లో విద్యార్థులు కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేశాక కళాశాల మార్చుకోవాలని ఉంటే ఆగస్టు 16, 17 వ తేదీలలో అవకాశం కల్పించారు.

అభ్యర్థులకు కావలసిన సర్టిఫికెట్లు :

కౌన్సిలింగ్ కు హాజరయ్యే విద్యార్థులు ఏఏ సర్టిఫికెట్లు తీసుకువెళ్లాలని ఆందోళన చెందుతుంటారు. అలాంటి ఆందోళన లేకుండా ముందుగానే ఏ సర్టిఫికెట్లు కావాలో నిర్ణయించింది.

♦️విద్యార్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు జిరాక్స్ సెట్లు వెంట తీసుకుని వెళ్లాలి.

♦️టీ జి ఎఫ్ సెట్ హాల్ టికెట్.

♦️TS EAPCET ర్యాంకు కార్డు.

♦️ఆధార్ కార్డు.

♦️ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ మార్కుల మెమోలు.

♦️6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్ల

♦️ఇంటర్మీడియట్ టి సి,

♦️ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ తర్వాత తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం.

♦️స్లాట్ బుకింగ్ చేసుకున్న రషీదు.

♦️ఈ డబ్ల్యు అభ్యర్థులు అయితే ఈ ఏడాది తీసుకున్న సర్టిఫికెట్ అందజేయాల్సి ఉంటుంది.

ALSO READ : 

WhatsApp : కొత్త టెక్నాలజీ పై ఫోకస్ పెట్టిన వాట్సప్.. మరో రెండు కొత్త ఫీచర్లు..!

Indiramma Gruhalu : ఇందిరమ్మ గృహాలకు ప్రభుత్వ మార్గదర్శకాలు సిద్ధం.. తాజా అప్డేట్స్..!

మరిన్ని వార్తలు