Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణసంక్షేమం

Indiramma Gruhalu : ఇందిరమ్మ గృహాలకు ప్రభుత్వ మార్గదర్శకాలు సిద్ధం.. తాజా అప్డేట్స్..!

Indiramma Gruhalu : ఇందిరమ్మ గృహాలకు ప్రభుత్వ మార్గదర్శకాలు సిద్ధం.. తాజా అప్డేట్స్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో:

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటిల అమలకు కృషి చేస్తున్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం, ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంపు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్ వినియోగదారులకు ఉచితం, ఇలా వరుసగా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఇచ్చిన మాట ప్రకారం రైతుల రుణమాఫీని కూడా అతి త్వరలో ప్రారంభించనున్నారు. అదే విధంగా ఇందిరమ్మ గృహాల విషయంలో ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇల్లు లేని పేదలందరికీ ఇండ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో గూడు లేని నిరుపేదలంటూ ఉండకూడదని నిర్ణయించుకున్నారు. ఇందిరామ్మ గృహాల లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలకు చొప్పున సహాయం అందించనున్నారు.

లబ్ధిదారులను తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు ఉండాలని నిర్ణయించారు. అదేవిధంగా ఇంటి స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని వారికి మొదటగా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. స్థానికులై నివాసం ఉండాలని నిర్ణయించారు. లబ్ధిదారుడికి 5 లక్షల రూపాయల సహాయం ప్రభుత్వం చేయనున్నది.

రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ గృహాలను నిర్మించనున్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ గృహాలను కేటాయించనున్నారు. అందుకుగాను రాష్ట్రవ్యాప్తంగా 22,500 కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ పథకాన్ని మార్చి 11వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రజా పాలన దరఖాస్తులలో భాగంగా ఇందిరమ్మ గృహాలకు కూడా దరఖాస్తులు స్వీకరించారు. ఆ మేరకు ఇందిరమ్మ గృహాలను మంజూరు చేయమన్నారు.

ALSO READ : 

Telangana : వెలవెలబోతున్న కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు.. ఏ ప్రాజెక్టులో ఎంత నీరు నీరుంది, ఎదురుచూస్తున్న రైతులు..!

Telangana Govt : సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు ఇక ఆన్ లైన్ ద్వారానే.. వెబ్ సైట్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..!

మరిన్ని వార్తలు