రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసిల్దార్..! 

ఓ రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటూ వనపర్తి జిల్లా గోపాల్ పేట తహసిల్దార్ శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసిల్దార్..! 

మనసాక్షి, వనపర్తి :

ఓ రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటూ వనపర్తి జిల్లా గోపాల్ పేట తహసిల్దార్ శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. మహబూబ్ నగర్ ఏసీబీ డిఎస్పి కృష్ణగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. గోపాల్‌ పేట మండల పరిధిలోని పలకపాటు గ్రామం జింకల మిట్ట తండా కు చెందిన రైతు మూడవత్ పాండు నాయక్ తనకున్న వ్యవసాయ భూమిలో కోళ్ల ఫారం షెడ్డు ఏర్పాటు చేశాడు.

కాగా ఆ స్థలాన్ని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు జూన్ 21వ తేదీన బ్యాంకు చలన్ చెల్లించాడు. 22వ తేదీన పాండు నాయక్ తన భార్య సౌందర్యతో కలిసి తహసిల్దార్ వద్దకు వెళ్లి కోళ్ల ఫారం షెడ్డు కు నాలా పర్మిషన్ ఇవ్వాలని కోరారు.

దాంతో తహసిల్దార్ 15 వేల రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. రైతు పాండు నాయక్ అంత డబ్బు ఇచ్చుకోలేమని కొంచెం తగ్గించాలని కోరగా పదివేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా జూన్ 23వ తేదీన మరోసారి వచ్చి సార్ అన్ని డబ్బులు కూడా ఇవ్వలేము అనగా చివరికి ఎనిమిది వేల రూపాయలు ఇస్తే నాలా పర్మిషన్ ఇస్తామని చెప్పడంతో పాండు నాయక్ ఇంటికి వెళ్లి అవినీతి నివేదాక అధికారులకు సంబంధించిన వీడియోలను చూశాడు. మహబూబ్ నగర్ డిఎస్పి కృష్ణ గౌడ్ ను స్వయంగా కలిశాడు.

ఇందులో భాగంగా కృష్ణ గౌడ్ తో పాటు మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు చెందిన నలుగురు సిఐలు, పదిమంది ఇతర సిబ్బందితో కలిసి పాండు నాయక్ కు ఎనిమిది వేల రూపాయలను ఇచ్చే విధంగా పథకం రూపొందించి అమలు చేశారు. డబ్బులు ఇచ్చి బయటకు వచ్చిన రైతు పాండు నాయక్ విషయాన్ని అధికారులకు తెలపడంతో వారు లోపలికి వెళ్లి తహసిల్దార్ ను అదుపులోకి తీసుకొని లంచం తీసుకున్న ఎనిమిది వేల రూపాయలను స్వాధీన పరుచుకొని కేసు నమోదు చేశారు.

ALSO READ  :

BREAKING : మరో సీనియర్ నేత బీఆర్ఎస్ కు గుడ్ బై.. కాంగ్రెస్ లో చేరిక..!

Telangana : వెలవెలబోతున్న కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు.. ఏ ప్రాజెక్టులో ఎంత నీరు నీరుంది, ఎదురుచూస్తున్న రైతులు..!