Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజాతీయంతెలంగాణరాజకీయం

BREAKING : మరో సీనియర్ నేత బీఆర్ఎస్ కు గుడ్ బై.. కాంగ్రెస్ లో చేరిక..!

BREAKING : మరో సీనియర్ నేత బీఆర్ఎస్ కు గుడ్ బై.. కాంగ్రెస్ లో చేరిక..!

న్యూఢిల్లీ , మనసాక్షి :

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా రోజుకు ఒకరు చొప్పున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దాంతో ఆ పార్టీ అధినేత కేసిఆర్ సతమతమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరో షాక్ తగిలింది. మరో సీనియర్ నేత బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున కార్గే నివాసంలో కాంగ్రెస్‌లో చేరారు.

కేశవరావుకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. లోకసభ విపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ దీపదాస్ మున్షి, పార్టీ సీనియర్ నాయకులు కేసీ వేణుగోపాల్, మధు యాష్కి తదితరులు ఉన్నారు.

ALSO READ : 

Telangana : వెలవెలబోతున్న కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు.. ఏ ప్రాజెక్టులో ఎంత నీరు నీరుంది, ఎదురుచూస్తున్న రైతులు..!

Power Bills : కరెంటు బిల్లుల చెల్లింపులో ఈ నెల నుంచి కష్టాలే.. ఫోన్ పే, గూగుల్ పే యాప్ లతో చెల్లిస్తే అంగీకరించబడవు..!

NALGONDA : లో వోల్టేజి సమస్యకు చెక్, హైదరాబాద్ తరహాలో నల్గొండ జిల్లాను అభివృద్ధి చేస్తా.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!

మరిన్ని వార్తలు