Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

BREAKING : హోటల్లు బేకరీలపై మున్సిపల్ కమిషనర్ దాడులు.. బెంగళూరు అయ్యాంగార్ బేకరీ కి జరిమానా..!

BREAKING : హోటల్లు బేకరీలపై మున్సిపల్ కమిషనర్ దాడులు.. బెంగళూరు అయ్యాంగార్ బేకరీ కి జరిమానా..!

రాజేంద్రనగర్, మనసాక్షి :

హోటళ్లు , బేకరీ నిర్వాహకులు నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే చర్యలు తప్పవని కమిషనర్ శరత్ చంద్ర పేర్కొన్నారు. బండ్లగూడ జాగిర్ నగర్ పాలక సంస్థ కమిషనర్ ఆదేశాల మేరకు శానిటేషన్ అధికారులు గురువారం మున్సిపల్ పరిధిలోని కాళికా నగర్ లో ఉన్న బెంగళూరు అయ్యాంగార్ బేకరీను శానిటేషన్ అధికారులు పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా పరిశుభ్రత లేకుండా తయారు చేస్తున్న బేకరి పదర్థాలు ఉండడంతో బేకరీకి రూ.9వేల జరిమానా విధించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ…. హోటళ్లు, బేకరిలు తదితర యాజమానులు నాణ్యత ప్రమాణాలు పాటించి వినియోగదారులకు నాణ్యమైన పదార్థాలను అందించాలని పరిశుభ్రత పాటించకుండా షాపులను నడిపిస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మొదటిసారి కాబట్టి ఫైన్ వేయడం జరిగిందని నిబంధనలు పాటించకుండా నడిపిస్తే హోటళ్లు , బేకరిలను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు.

నిర్వహకులు ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోని నాణ్యమైన ఫుడ్ ని అందించాలని సూచించారు. లేనిచో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్ పెక్టర్ నరేష్, జూనియర్ అసిస్టెంట్ శ్రీశైలం, పెనాల్టీ టీం శ్రీనివాస్, ముదాస్సిర్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

TS EAPSET 2024 Counselling : తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రారంభం.. ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి..!

WhatsApp : కొత్త టెక్నాలజీ పై ఫోకస్ పెట్టిన వాట్సప్.. మరో రెండు కొత్త ఫీచర్లు..!

మరిన్ని వార్తలు