Laxettipet : సూసైడ్ నోట్ లో క్లియర్ గా రాసిన వ్యాపారి.. ఉరి వేసుకుని ఆత్మహత్య..!
Laxettipet : సూసైడ్ నోట్ లో క్లియర్ గా రాసిన వ్యాపారి.. ఉరి వేసుకుని ఆత్మహత్య..!
లక్షేట్టిపేట్, (మన సాక్షి);
లక్షెట్టిపేట పట్టణంలోని పాతబస్టాండ్ ఏరియాలో శేశోద్యల ప్రతాప్ సింగ్ అనే (55)సంవత్సరాల వ్యాపారి తన దుకాణంలో మంగళవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. మృతుడు తన భార్యతో కలిసి బొల్ల దుకాణం నిర్వహిస్తున్నాడు.
గత కొంత కాలంగా వ్యాపారం సరిగ్గా సాగడం లేదు. అక్కడక్కడా అప్పులు కూడా చేసాడు. గత కొద్ది రోజుల క్రితం ముగ్గురు వ్యక్తులతో వ్యాపారం చేసి డబ్బు పొడగొట్టుకుని ఇబ్బంది పడ్డారు. తనకు రావలసిన సుమారు కోటి రూపాయల వరకు రావాల్సి ఉంది. తనకు రావాల్సిన డబ్బు సమయానికి రాకపోగా తను తెచ్చిన చొట ఇచ్చిన మాట ప్రకారం చెల్లించలేక పోతున్నానని మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తను ఇచ్చే అప్పు వివరాలు అదేవిధంగా తనకు ఇవ్వాల్సిన వాళ్ళా వివరాలు మొత్తం సూసైడ్ నోట్ లో రాసి మృతికి పాల్పడ్డాడు. మృతుని భార్య ఉమ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని లక్షట్ పేట్ ఎస్సై సతీష్ తెలిపారు.
ఇవి కూడా చదవండి :
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం.. ఆల్మట్టికి ఇన్ ఫ్లో, సాగర్ ఆయకట్టులో ఆశలు..!









