తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుపండుగలుహైదరాబాద్

Mahankali Amma Vari Bonalu : ప్రారంభమైన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు.. దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..!

Mahankali Amma Vari Bonalu : ప్రారంభమైన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు.. దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..!

మన సాక్షి, సికింద్రాబాద్ :

ఆషాడ మాసం బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. అమ్మవారి గర్భగుడిలో భక్తుల రద్దీ పెరిగింది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా ఆలయ ప్రాంతంలో కూడా ట్రాఫిక్ నిబంధనలు విధించారు.

రెండు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమ్మవారి దేవాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో పెట్టారు. భక్తులు క్యూ లైన్ లో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. పోలీసులు వాలంటీర్లు భక్తుల రద్దీ నియంత్రించడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆయనతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు ఉన్నారు.

ALSO READ : 

Srishailam Dam : శ్రీశైలంకు భారీగా పెరిగిన ఇన్ ఫ్లో.. ఒక్క రోజులోనే 4 అడుగడుగులు పెరిగిన జలాశయ నీటిమట్టం.. లేటెస్ట్ అప్డేట్..!

Godavari : గోదావరికి వరద ఉధృతి.. ధవళేశ్వరం 175 గేట్లు ఎత్తి నీటి విడుదల..!

Hyderabad : హైదరాబాదులో పోలీసుల స్పెషల్ ఆపరేషన్.. మరోసారి భారీగా హెరాయిన్ పట్టివేత, ముఠా అరెస్ట్..!

మరిన్ని వార్తలు