Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుహైదరాబాద్

Hyderabad : హైదరాబాదులో పోలీసుల స్పెషల్ ఆపరేషన్.. మరోసారి భారీగా హెరాయిన్ పట్టివేత, ముఠా అరెస్ట్..!

Hyderabad : హైదరాబాదులో పోలీసుల స్పెషల్ ఆపరేషన్.. మరోసారి భారీగా హెరాయిన్ పట్టివేత, ముఠా అరెస్ట్..!

శేరిలింగంపల్లి, మన సాక్షి :

హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. శంషాబాద్ ఎస్ఓటీ, మాదాపూర్ పోలీసులు నార్కోటిక్ బ్యూరో సహాయంతో నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్ లో హెరాయిన్ ముఠాను పట్టుకున్నారు. శిల్పారామం సమీపంలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కిలో హెరాయిన్, 4 స్మార్ట్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ హెరాయిన్ డ్రగ్స్ విలువ 7 కోట్ల వరకు ఉంటుందని సిపి మహంతి చెప్పారు.

కిలో హెరాయిన్ నాలుగు ప్యాకెట్లలో ఒక్కొక్కటి 250 గ్రాములు చొప్పున ప్యాక్ చేసి తీసుకువచ్చారు. నలుగురు నిందితులు రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవారని తెలిపారు. డ్రగ్స్ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ అవినాష్ మహంతి మీడియాకు వెల్లడించారు. రాజస్థాన్ నాగౌర్ జిల్లాకు చెందిన సంతోష్ ఆచారి ప్రస్తుతం జోధ్‌పూర్ జైలులో ఉన్నాడు. జైలుకు వెళ్తూ తనతో ఉన్న డ్రగ్స్ సంతోష్ ఆచారి , నేమి చందుకు ఇచ్చాడు.

అలా తనతో డ్రగ్స్ను ఇతరులకు విక్రయించాలని భావించాడు. నేమి చంద్ రెండు నెలల క్రితం హైదరాబాద్‌లోని తన సోదరుడు అజయ్ భాటి దగ్గరక వచ్చాడు. అజయ్ భాటి అబ్దుల్లా పూర్ మేట్ లో నివాసం ఉంటున్నాడు. హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయించడానికి అజయ్ భాటి ప్లాన్ చేశారు. ప్లాన్ ప్రకారం నేమీ చంద్, నర్పత్ సింగ్ ఒక కేజీ హెరాయిన్ నాలుగు ప్యాకెట్లు తీసుకుని వచ్చారు.

రాజస్థాన్ నుంచి వస్తూ డ్రగ్స్ ను బస్సులో తీసుకు వచ్చాడు. నిందితులు స్వీట్స్ మాటున హెరాయిన్ డ్రగ్స్ తీసుకువచ్చారు. అజయ్ భాటితో పాటు చౌటుప్పల్ కు చెందిన హరీష్ సిర్విని కలిసి హైదరాబాద్‌లో డ్రగ్ విక్రయిద్దం అని ప్లాన్ చేసి తీసుకువచ్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు నిందితులను పట్టుకున్నారని తెలిపారు. 

ALSO READ : 

Hyderabad : మూసీ పరివాహక అభివృద్ధి కోసం రూ.1.50 లక్షల కోట్లతో ప్రణాళిక.. గోపన్ పల్లిలో ఫ్లై ఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..!

Srishailam : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద.. జూరాల గేట్లు ఎత్తిన అధికారులు, పెరుగుతున్న నీటిమట్టం..!

Cm Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ పై కీలక ప్రకటన.. ఖాళీలపై అప్పుడే నోటిఫికేషన్..!

మరిన్ని వార్తలు