Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsఅభివృద్దిజిల్లా వార్తలుహైదరాబాద్

Hyderabad : మూసీ పరివాహక అభివృద్ధి కోసం రూ.1.50 లక్షల కోట్లతో ప్రణాళిక.. గోపన్ పల్లిలో ఫ్లై ఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..!

Hyderabad : మూసీ పరివాహక అభివృద్ధి కోసం రూ.1.50 లక్షల కోట్లతో ప్రణాళిక.. గోపన్ పల్లిలో ఫ్లై ఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..!

శేరిలింగంపల్లి, మన సాక్షి:

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ గోపన్ పల్లిలో సుమారు రూ.28.5 కోట్లతో రోడ్లు భవనాల శాఖ, పీవీ రావు నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఫ్లై ఓవర్ ను శనివారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శాంశక,తెలంగాణ రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్ రెడ్డి రామిరెడ్డి, తెలంగాణ ఏంబిసి చైర్మన్ జేరిపేటి జైపాల్,డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి , కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి,రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్,హమీద్ పటేల్ , దొడ్ల వెంకటేష్ గౌడ్,జగదీశ్వర్ గౌడ్, ఆర్ అండ్ బి స్పెషల్ సెక్రటరీ హరిచందన, జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, డీసీ రజినీకాంత్ రెడ్డిలు పాల్గొన్నారు.

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతుంది. మరింత వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఎక్కడ అభివృద్ధి ఆగకుండా మరిన్ని నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తాం అన్నారు. మూసీ పరివాహక అభివృద్ధి కోసం లక్షా 50 వేల కోట్లతో ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. విశ్వనగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దినప్పుడే ఇక్కడ మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు.

ఔటర్ రింగ్ రోడ్డు వచ్చాక గోపన్ పల్లి లాంటి ప్రాంతాలు ఎంతో ప్రగతి సాధించాయని, ఇక్కడ ఎకరా రూ. 100 కోట్లు పలుకుతుందని అన్నారు. మూసీని చూస్తే లండన్ ను తలపించాలని అన్నారు. మూసీ అభివృద్ధిని చూస్తేనే ప్రజా ప్రభుత్వం గుర్తుకు వచ్చేలా తీర్చిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శాంశక, తెలంగాణ రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్ రెడ్డి రామిరెడ్డి, తెలంగాణ ఏంబిసి చైర్మన్ జేరిపేటి జైపాల్,డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి,

కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి,రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్,హమీద్ పటేల్ , దొడ్ల వెంకటేష్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్, ఆర్ అండ్ బి స్పెషల్ సెక్రటరీ హరిచందన, జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, డీసీ రజినీకాంత్ రెడ్డి, ఆర్ అండ్ బి  అధికారులు డీఈ  మోహన్ నాయక్, ఎస్ ఈ  వెంకటేశ్వరరావు, ఈఈ  మధుసూదన్, డీఈ  సీతారామయ్య, ఏఈ  అజయ్ కుమార్,జి హెచ్ ఏం సి  అధికారులు ఎస్ఈ  శంకర్ నాయక్ ,ఈఈ  శ్రీనివాస్ ,డీఈ  రమేష్పా ల్గొన్నారు.

ALSO READ : 

Cm Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ పై కీలక ప్రకటన.. ఖాళీలపై అప్పుడే నోటిఫికేషన్..!

Good News : తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. రేవంత్ రెడ్డి మరో కొత్త పథకం..!

BREAKING : హడలెత్తిస్తున్న జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.. రోజుకో అధికారి సస్పెండ్, వ్యవసాయ శాఖ ఏవో సస్పెండ్

మరిన్ని వార్తలు