Srisailam : శ్రీశైలం వద్ద అధికారుల హై అలర్ట్.. భారీగా పెరిగిన వరద ఉధృతి.. Latest Update
Srisailam : శ్రీశైలం వద్ద అధికారుల హై అలర్ట్.. భారీగా పెరిగిన వరద ఉధృతి.. Latest Update
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద అధికారులు హై అలర్ట్ తో ఉన్నారు. ఎగువ నుంచి గంట గంటకు వరద ఉధృతి పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణానది ఉదృతంగా ప్రవహిస్తుంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండాయి. అదేవిధంగా తుంగభద్ర ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో సుంకేసుల నుంచి కూడా భారీగా వరద శ్రీశైలం కు చేరుతుంది.
దాంతో శ్రీశైలం 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తేందుకు అధికారులు అప్రమత్తమయ్యారు.
జూరాల ప్రాజెక్టు నుంచి 3,19, 682 క్యూసెక్కుల ఇన్ ఫ్లో శ్రీశైలంకు చేరుతుండగా.. సుంకేసుల జలాశయం నుంచి 22,389 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. దాంతో శ్రీశైలంలో 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి 3,78, 172 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
సాగర్ కు పెరిగిన వరద :
శ్రీశైలం నుంచి దిగువకు భారీగా నీటిని విడుదల చేయడంతో సాగర్ కు వరద పెరిగింది. శ్రీశైలం ఇన్ ఫ్లో మొత్తం దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో నాగార్జునసాగర్ లో గంట గంటకు నీటిమట్టం పెరుగుతోంది. నాగార్జునసాగర్ జలాశయ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 162 టీఎంసీల నీరు చేరింది.
ఇవి కూడా చదవండి :
Srisailam : కృష్ణమ్మ పరవళ్ళు.. శ్రీశైలంకు 3.26 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో.. Latest Update
Cm Revanth Reddy: రైతులకు బిగ్ రిలీఫ్.. రూ.1350 కోట్లతో ఆ పథకం.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన..!









