Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

తల్లిదండ్రుల కష్టానికి ఫలితం.. అన్నా చెల్లెలు కు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు..!

తల్లిదండ్రుల కష్టానికి ఫలితం.. అన్నా చెల్లెలు కు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు..!

సూర్యాపేట, మన సాక్షి :

ఎంతో కష్టపడి సంపాదించి చదివించినా.. పిల్లలకు ఉద్యోగాలు రాక బాధపడుతున్న తల్లిదండ్రులను చూస్తుంటాం. కానీ ఆ ఇంట్లో అన్నా చెల్లిలు ఒకే సారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులతో పాటు బంధువులను ఆనందోత్సవాల్లో ముంచారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన సమ్మెట విజయ్‌ కుమార్‌, రేణుక ఎల్లమ్మలకు కుమారుడు రాహుల్‌ గౌడ్‌, కుమార్తె ఐశ్వర్య ఉన్నారు.

తండ్రి ఉన్న కొద్దిపాటి వ్యవసాయం చేస్తూ పాన్‌ షాప్‌ నడుపుతుండే వాడు. పిల్లలను కష్టపడి చదివించి విద్యాబుద్ధులు నేర్పించి ఉద్యోగం సాధించాలనే లక్ష్యం నెరవేరడంతో ఆనందం వ్యక్తం చేశారు. కుమారుడు రాహుల్‌ గౌడ్‌ సుృజన స్కూల్‌లో పది వరకు చదివి ఇంటర్‌ శ్రీ గాయత్రి, బీటెక్‌ శ్రీఇందు కళాశాలలో చదువుకొని కోచింగ్‌ తీసుకొని లైబ్రరీలో చదువుకున్నారు.

ఇటీవల నిర్వహించి టీజీపీఎస్‌సీలో-2023 పరీక్ష రాయగా ఈ నెల 2న ప్రకటించిన ఫలితాల్లో 450 మార్కులకు గాను 345 మార్కులు సాధించి పంచాయితీ రాజ్‌లో ఏఈఈ ఉద్యోగం పొందాడు.

కుమార్తె ఐశ్వర్య సృజన స్కూల్‌లో పది వరకు చదివి శ్రీ చైతన్యలో ఇంటర్‌, బీటెక్‌ సీఎంఆర్‌లో చదువుకుంది. టీజీపీఎస్‌సీలో-2023 పరీక్ష రాయగా ఈ నెల 2న ప్రకటించిన ఫలితాల్లో 450 మార్కులకు గాను 337 మార్కులు సాధించి పబ్లిక్‌ హెల్త్‌లో ఏఈఈ ఉద్యోగం పొందింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ వారికి స్వీట్‌ తినిపించి ఆనందం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి : 

మిర్యాలగూడ : మల్టీ డ్రగ్ వన్ స్టెప్ టెస్ట్ డివైస్ తో గంజాయి సేవించిన వారి గుర్తింపు..!

Nagarjunasagar : నాగార్జునసాగర్ డ్యామ్ 16 గేట్ల ఎత్తి నీటి విడుదల.. ఎడమ కాలువకు రెండు పంటలకు నీళ్లు..! 

తెలంగాణలో ఉప ఎన్నికలు.. వైరల్ అవుతున్న న్యూస్..!

Viral video : బైక్ పై వెళ్తూనే ఇదేం పాడు పని.. రెచ్చిపోయిన ప్రేమ జంట.. (వైరల్ వీడియో)

మరిన్ని వార్తలు