Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణములుగు జిల్లా

Sand : జాతీయ రహదారిపై ఇసుక దందా..!

Sand : జాతీయ రహదారిపై ఇసుక దందా..!

మంగపేట, మన సాక్షి ప్రతినిధి

అధికారుల పర్యవేక్షణ లేక ఇసుక వ్యాపారుల దందా కొనసాగుతోంది. మంగపేట మండలంలోని చుంచుపల్లి గ్రామంలో సొసైటీ ఇసుక ర్యాంపు లకు అనుమతి వచ్చినప్పటికీ లోడింగ్ చేసేందుకుగాను పార్కింగ్ స్థలం లేదు. దీంతో సిరియల్ లోనే ఉంచి రోడ్ పైనే లోడింగ్ చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

అదేవిధంగా టీజీఎండీసీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో లోడింగ్ క్వారీ గుమాస్తాలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ డీడీలు ఉన్నా మామూళ్లు తడపాల్సిందే. లారీ డ్రైవర్ల వద్ద నుంచి ఒక్కొక్క లారీకి లోడింగ్ పేరుతో రూ.5వేల నుంచి 6వేల వరకు వసూళ్లు చేస్తున్నట్లు డ్రైవర్లు చెబుతున్నారు.

రైజింగ్ కాంట్రాక్టర్లకు సంబంధించిన విషయాలపై మైనింగ్, రెవెన్యూ అధికారులు పర్యవేక్షణ లేకుండా చూసి చూడనట్టు గా వ్యవహరిస్తున్నారు. ఎన్హెచ్ పైనే ఇసుక లోడింగ్ చేస్తుండటంతో లారీలు ఇష్టారాజ్యంగా నిలుపుతున్నారు. దీంతో అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.

అయినప్పటికి వారు తమకేమీ పట్టదన్నట్టుగా ఇసుకను రోడ్డు మీద లోడింగ్ చేస్తున్నారు. స్థానిక ప్రజలు, వాహనదారులు ప్రయాణ సౌకర్యం సరిగా లేక చాలా ఇబ్బంది పడుతున్నట్లు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధి కారులు పట్టించుకొని ప్రయాణికులకు ప్రాణనష్టం కాకుండా చూసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

ALSO READ : 

Job Mela: నిరుద్యోగులకు శుభవార్త.. 50 కంపెనీలతో మెగా జాబ్ మేళ.. టెన్త్ పాస్ అయిన వారికి కూడా అవకాశం..!

Miryalaguda : మిర్యాలగూడలో ఘరానా మోసం.. రూ.5 కోట్లు అప్పు ఇస్తామని నమ్మించి, 60 లక్షలతో పరార్..!

Good News : రైతులకు కేంద్రం సర్కార్ గుడ్ న్యూస్.. ఎరువుల ధరపై సబ్సిడీ పెంపు..!

Good News : ప్రభుత్వం గుడ్ న్యూస్.. మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచిత కుట్టు మిషన్ పథకం, దరఖాస్తు చేసుకోండి ఇలా..!

మరిన్ని వార్తలు