Breaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా
Suryapet : ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి..!
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని ఖానాపురం గ్రామానికి చెందిన కనగాల రామకోటమ్మ (72) ట్రాక్టర్ ఢీకొని చనిపోయినట్లు,ఏఎస్ఐ లింగారెడ్డి తెలిపారు.

Suryapet : ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి..!
అనంతగిరి :
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని ఖానాపురం గ్రామానికి చెందిన కనగాల రామకోటమ్మ (72) ట్రాక్టర్ ఢీకొని చనిపోయినట్లు,ఏఎస్ఐ లింగారెడ్డి తెలిపారు. ఏఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం..
రామకోటమ్మ తమ ఇంటి నుంచి బజార్ కు వెళ్తుండగా ఇసుక ట్రాక్టర్ నడుపుతున్న డ్రైవర్, ట్రాక్టర్ ను అతివేగంగా, అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా ఒక్కసారిగా రివర్స్ తీసుకుని బజారు గుండా వెళ్తున్న మృతురాలైన రామకోటమ్మ ను ఢీ కొట్టి తన పై నుండి ట్రాక్టర్ ట్రాలీను పోనివ్వగా, మృతురాలి తల ఛిద్రం అయ్యి, కాళ్లకు, చేతులకు, నడుములకు బలమైన గాయాలయి అక్కడికక్కడే చనిపోయినట్లు తెలిపారు. మృతురాలు కొడుకు కనగాల శేషయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.









