Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలునల్గొండ

District collector : రేపు దేవరకొండ, మిర్యాలగూడలో మంత్రి పర్యటన.. సమీక్షకు పూర్తి సమాచారంతో హాజరు కావాలి, జిల్లా కలెక్టర్ ఆదేశం..!

District collector : రేపు దేవరకొండ, మిర్యాలగూడలో మంత్రి పర్యటన.. సమీక్షకు పూర్తి సమాచారంతో హాజరు కావాలి, జిల్లా కలెక్టర్ ఆదేశం..!

నల్లగొండ, మన సాక్షి :
మిర్యాలగూడ, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని లిఫ్ట్ ఇరిగేషన్లు, నీటి పారుదల పనుల పై సమీక్ష నిమిత్తం ఆదివారం (11.8.2024) జిల్లాకు వస్తున్న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి జిల్లా పర్యటన ఏర్పాట్ల విషయమై శనివారం జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు
ఆదివారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటలకు నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకం సైట్ కు చేరుకుంటారని, అక్కడే మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని అన్ని ఎత్తిపోతల పథకాలు, నీటిపారుదల పనులపై ఇరిగేషన్, రెవెన్యూ ఇతర సంబంధిత అధికారులతో సమీక్షిస్తారని తెలిపారు.

సాయంత్రం 4 గంటలకు దున్నపోతుల గండి నుండి బయలుదేరి 4.20 కి డిండి చేరుకుంటానని, అక్కడ దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని సాగునీటి పనుల పై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. సమీక్ష అనంతరం తిరిగి సాయంత్రం 6 గంటలకు మంత్రి హైదరాబాద్ వెళ్తారని పేర్కొన్నారు.

నీటిపారుదల శాఖ మంత్రి లిఫ్ట్ ఇరిగేషన్, నీటిపారుదల పనులపై సమీక్ష సందర్భంగా దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకం , డిండి ప్రాజక్ట్, అలాగే మిర్యాలగూడ, దేవరకొండ నియోజక వర్గాలకు సంబంధించిన నీటిపారుదల పనులు సమీక్షిస్తారని, అందువల్ల జిల్లాలో చేపట్టిన మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి వివరాలతో అధికారులు హాజరుకావాలని అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా భూసేకరణకు సంబంధించిన వివరాలతో రెవెన్యూ అధికారులు హాజరు కావాలని ఆయన ఆదేశించారు. ఇరిగేషన్, రెవెన్యూ తో పాటు, అటవీ ,ఇతర సంబంధిత అధికారులందరూ సమీక్ష సమావేశానికి హాజరు కావలసిందిగా ఆదేశించారు.

ఏలాంటి పొరపాట్లు లేకుండా సంబందిత అధికారులు అందరూ చర్యలు తీసుకోవాలని, ప్రత్యేకించి సమీక్ష సందర్భంగా అవసరమైన నోట్స్ ను ముందే సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్,
నాగార్జునసాగర్ ప్రాజెక్టు సీఈ నాగేశ్వరావు ,ఎస్ ఈ వెంకటేశ్వర్లు, డిండి ప్రాజెక్టు ఇంజనీర్లు, డిఎఫ్ఓ రాజశేఖర్,  ఆర్టీవోలు, తహసిల్దారులు, తదితరులు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి : 

Viral News : ఏడవ తరగతి కుర్రాడి లీవ్ లెటర్.. చదివితే పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే..!

NALGONDA : నల్గొండ పోలీసుల స్పెషల్ డ్రైవ్.. ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు రోడ్డు రోలర్ తో తొక్కిస్తూ ధ్వంసం..!

ఉన్న గదులు కూల్చారు.. కొత్త వాటిని నిర్మించలేదు.. వరండాలో పాఠాలు..!

Rythu Barosa : రైతు భరోసా వారికేనా.. ఆలస్యం అందుకేనా..!

 

మరిన్ని వార్తలు