Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసూర్యాపేట జిల్లా

CPI (ML) : పేదలను ఇబ్బందులకు గురి చేస్తే పరిణామాలు తీవ్రం.. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య స్వీట్ వార్నింగ్..!

CPI (ML) : పేదలను ఇబ్బందులకు గురి చేస్తే పరిణామాలు తీవ్రం.. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య స్వీట్ వార్నింగ్..!

సూర్యపేట, మన సాక్షి:

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని కుడ కుడ శివారు సర్వేనెంబర్ 126 ప్రభుత్వ భూమిలో గుడిసెలేసుకొని జీవిస్తున్న పేదలను ఇబ్బందులకు గురిచేస్తే జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య హెచ్చరించారు. శుక్రవారం లెనిన్ నగర్ లో గుడిసెలు వేసుకున్న వాళ్ళతో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ గోకినపల్లి వేంకటేశ్వర రావు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుండి నిలువ నీడలేని నిరుపేదలు కుడకుడ శివారు సర్వేనెంబర్ 126లో గుడిసెలేసుకొని జీవిస్తూ ఉంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వం అనేకసార్లు గుడిసెలను తీసి పేదలపైన,మా పార్టీ నాయకుల పైన అక్రమ కేసులు పెట్టారని అన్నారు.అయినా పేదలు భయపడకుండా గుడిసెలేసుకొని జీవిస్తుంటే 2022 అక్టోబర్ 10న కుడకుడ గ్రామానికి చెందిన ఒక టిఆర్ఎస్ నాయకుడు,అతని కిరాయి గుండాలు కలిసి మా మహిళ పైన దాడులు చేశారు అన్నారు.

మా పార్టీ నాయకుల పైన, పేదల పైన అక్రమ కేసులు అప్పటి ప్రభుత్వం పెట్టించారు అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వినతి పత్రాలు ఇస్తూ అదే భూమిలో పేదలు గుడిసెలు వేసుకొని జీవిస్తుంటే గత నాలుగైదు రోజుల నుండి గతంలో గొడవలు చేసిన వారే తిరిగి కవ్విస్తూ గొడవలు సృష్టించాలని చూస్తున్నారు అన్నారు.

వివిధ పద్ధతుల్లో పేదలను రెచ్చగొడుతూ,గతంలో లాగానే మరొకసారి ఏదైనా పేదలకు నష్టం జరిగితే మా పార్టీ తీవ్రంగా తీసుకొని,దాని కారణమైన వారి పైన చర్య తీసుకుంటుందని హెచ్చరించారు.మా పార్టీ చరిత్ర తెలుసుకొని ఇక్కడున్న టిఆర్ఎస్ నాయకుడు, అతని అనుచరులు నడుచుకుంటే వాళ్లకే మంచిదని, లేకపోతే జరగబోయే పరిణామాలకు వారే బాధ్యత వహించవలసి ఉంటుంది అని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా కన్వీనర్ గొడ్డలి నర్సయ్య, పిఓడబ్ల్యు జిల్లా ఉపాధ్యక్షులు సురం రేణుక, పార్టి పట్టణ కార్యదర్శి గులాం హుస్సేన్, డివిజన్ నాయకులు వీరబాబు,రాంజీ, వాజిద్, మోహన్, షారుఖ్, మోహన్, పద్మ, ఎల్లమ్మ, విజయ్, శంకర్, రవి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 

Rythu : రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్.. గాంధీ జయంతి నుంచి అమలు..!

Cm Revanth Reddy : మీకు రుణమాఫీ కాలేదా.. ఐతే రేవంత్ శుభవార్త..!

ఎండలు, ఉక్కపోత ఎందుకో తెలుసా.. వాతావరణశాఖ బిగ్ అప్డేట్..!

మరిన్ని వార్తలు