Srisailam : శ్రీశైలంకు వరద ఉధృతి.. ఇన్ ఫ్లో 5 లక్షల క్యూసెక్కులు, సాగర్ కు 4 లక్షల క్యూసెక్కులు.. Latest Update
Srisailam : శ్రీశైలంకు వరద ఉధృతి.. ఇన్ ఫ్లో 5 లక్షల క్యూసెక్కులు, సాగర్ కు 4 లక్షల క్యూసెక్కులు.. Latest Update
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో పాటు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్ని గతంలోనే నిండుకుండలా మారడంతో ప్రస్తుత నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఆల్మట్టి డ్యాం గేట్లెత్తి దిగువకు లక్షల క్యూసెక్కుల నీటిని దిగు విడుదల చేస్తుండగా జూరాల ప్రాజెక్టు నుంచి కూడా 5 లక్షల పైగా క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
దాంతో శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టుకు 5,02, 224 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా దిగువకు 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం వద్ద కుడి, ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. దిగువకు 4.70 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
కాగా నాగార్జున సాగర్ జలాశయానికి 4,05,242 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. కాగా నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా ఉండడం వల్ల వరద ఉధృతి పెరగడంతో సాగర్ 12 గేట్ల ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
LATEST UPDATE :
Railway : రాత పరీక్ష లేకుండానే రైల్వే జాబ్.. మళ్లీ ఇలాంటి ఛాన్స్ రాదు..!
Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే ఖాతాలలోకి డబ్బులు..!
BREAKING : విజయవాడ హైవే బ్లాక్.. మిర్యాలగూడ మీదుగా ట్రాఫిక్ మళ్లింపు..!
Nagarjuna Sagar : నాగార్జునసాగర్ ఎడమ కాలువకు భారీ గండి.. నీట మునిగిన పంట పొలాలు..!









