viralBreaking NewsTOP STORIES

ఆర్టీసీ బస్సు ఆపి వెర్రి చేష్టలు.. సోషల్ మీడియాలో లైకుల కోసం ఇదేం పిచ్చి పని..!

ఆర్టీసీ బస్సు ఆపి వెర్రి చేష్టలు.. సోషల్ మీడియాలో లైకుల కోసం ఇదేం పిచ్చి పని..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

సోషల్ మీడియాలో హైలెట్ కోసం వెర్రి చేష్టలు చేస్తున్నారు. ఇతరులకు అసౌకర్యం కలుగుతుందని భావన కూడా లేకుండా లైకులు, కామెంట్ల కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. ఇలాంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది.

ఒక యువకుడు ఆర్టీసీ బస్సును ఆపి ఎక్కిన వెంటనే దిగి పరుగు పెట్టటం.. దానిని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం.. కాగా సోషల్ మీడియాలో రీల్స్ పెట్టిన యువకుడికి తెలంగాణ ఆర్టీసీ ఎండి విసి సజ్జనార్ ట్విట్టర్ వేదికగా హితవు చెప్పాడు.

సోషల్ మీడియాలో పాపులర్ కోసం వీరి చేష్టలు అవసరమా.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారికి అసౌకర్యం కలుగుతుందనే సోయ లేకుండా వికృతానందం పొందుతున్నారు. లైకులు, కామెంట్ల కోసం పిచ్చి పనులు మానుకోండి.

బంగారు భవిష్యత్తుకు బాటలు వేసి జీవితంలో ఉన్నతంగా ఎదగండి. అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. దాంతో అనేకమంది వివిధ రకాల కామెంట్స్ పెడుతున్నారు. అలాంటి వేర్రి చేష్టలు వేసే వారిని జైలుకు పంపాలని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు.

 

LATEST UPDATE : 

బ్లడ్ మూన్.. ఈనెల 28న భూమి అంతం.. వణుకు పుట్టిస్తున్న సిద్ధాంతకర్తల సాక్షాలు..?

Rythu : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమా కోసం మొబైల్ యాప్..!

Nagarjunasagar : నిండుకుండలా నాగార్జునసాగర్.. 24 గేట్లు ఎత్తివేత..!

మరిన్ని వార్తలు