State Leval : రాష్ట్ర స్థాయి బేస్ బాల్ పోటీలకు జడ్పీ స్కూల్ విద్యార్థుల ఎంపిక..!
State Leval : రాష్ట్ర స్థాయి బేస్ బాల్ పోటీలకు జడ్పీ స్కూల్ విద్యార్థుల ఎంపిక..!
రామగిరి (మన సాక్షి):
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుచున్న విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికయ్యారు. 10వ తరగతి విద్యార్థి ఏ.హరిశ్చంద్రప్రసాద్, 9వ తరగతి విద్యార్థి డి.కార్తికేయ రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలలో పాల్గొననున్నారు.
సెప్టెంబర్ 1న జరిగిన జిల్లాస్థాయి జూనియర్ ఇంటర్ బేస్ బాల్ సెలక్షన్స్ లో ప్రతిభ కనబరిచి పెద్దపల్లి జిల్లా జట్టుకు ఎంపికై, సెప్టెంబర్ 14 నుండి 16వరకు నిర్మల్ జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బేస్ బాల్ చాంపియన్షిప్ పోటీలో పాల్గొననున్నట్లు పాఠశాల ప్రధానాచార్యులు టి.శోభన్రావు తెలిపారు.
ఈసందర్భంగా పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మెన్ శ్రీమతి బొనగాని హారిక, ఫిజికల్ డైరెక్టర్ కే.సతీష్, మరియు ఉపాధ్యాయ బృందం, తోటి విద్యార్థులు ఎంపికైన విద్యార్థులను అభినందిస్తూ, ఈ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి పెద్దపల్లి జిల్లాతో పాటు, పాఠశాలకు పేరుతేవాలని ఆకాంక్షించారు.
LATEST UPDATE :
మహిళలకు శుభవార్త.. వ్యాపార రంగంలో ప్రోత్సాహం, జిల్లా కలెక్టర్ ఆదేశం..!
Success Story : వ్యవసాయాన్నేి నమ్ముకున్నాడు.. ఏడాదికి కోటి సంపాదన..!
మిర్యాలగూడ : యాదాద్రి థర్మల్ ప్లాంట్ లో చోరీ.. భద్రత లోపంపై ఎమ్మెల్యే ఆగ్రహం..!
మిర్యాలగూడ : మాజీ సీఎం వైఎస్ జగన్ పేరుతో గణేష్ లడ్డు లక్కీ డిప్..!









