Peddapalli : శిక్షణ పొందిన అభ్యర్థులకు పోస్టింగ్ ఉత్తర్వుల అందజేత..!
Peddapalli : శిక్షణ పొందిన అభ్యర్థులకు పోస్టింగ్ ఉత్తర్వుల అందజేత..!
రామగిరి, (మన సాక్షి):
అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలోని ఎం.వి.టి.సి. లో 48 రోజుల శిక్షణ పూర్తయిన డిపెండెంట్లకు గురువారం జి.ఎం. కార్యాలయంనందు నిర్వహించిన కార్యక్రమంలో అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొప్పుల వెంకటేశ్వర్లు పోస్టింగ్ ఉత్తర్వులను అందజేశారు.
ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ సింగరేణి సంస్థలో ఉద్యోగానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి ఉద్యోగంలో చేరుతున్నారని, అయితే ఆ స్థాయికి తగ్గట్టుగా పని చేస్తూ, అధికారులు, సూపర్వైజర్ల ఆదేశాలను పాటిస్తూ అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, భద్రతతో విధులు నిర్వహిస్తూ మీకు ఈ ఉద్యోగం చేయడానికి అవకాశం కల్పించిన మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.
చెడు అలవాట్లకు బానిసై విధులకు గైర్హాజరు కావద్దని, సీనియర్ ఉద్యోగుల దగ్గర క్రమశిక్షణతో పని నేర్చుకొని, కలిసి కట్టుగా పనిచేసి మున్ముందు మంచి పదోన్నతులు సాధించి కుటుంబంతో పాటు సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారి కె.నాగేశ్వర రావు, ఎస్వోటు జి.ఎం బి.సత్యనారాయణ, పర్సనల్ విభాగాధిపతి బి.సుదర్శనం, ప్రాజెక్ట్ ఇంజినీర్ టి.రఘురాం,ఎంవిటిసి మేనేజర్ మల్లన్న, జూనియర్ అసిస్టెంట్ క్రాంతికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
Peddapalli : భూ ఆక్రమణలపై కఠిన చర్యలు.. అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల..!
Harish Rao : కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ వ్యవహారంపై హరీష్ రావు కీలక ట్వీట్..!
BIG BREAKING : కౌశిక్ రెడ్డి ఇంటికి అరికెపూడి.. రాష్ట్రంలో హై టెన్షన్..!
Runamafi : రుణమాఫీ కానీ వారికి సర్వే అయ్యిందా.. ఐతే ఖాతాలలోకి మాఫీ సొమ్ము..!









