Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురాజకీయం

రాహుల్ గాంధీ పై వివాదాస్పద వాఖ్యలు.. ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ పై ఎంపీ చామల పోలీస్ స్టేషన్ లో పిర్యాదు..!

రాహుల్ గాంధీ పై వివాదాస్పద వాఖ్యలు.. ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ పై ఎంపీ చామల పోలీస్ స్టేషన్ లో పిర్యాదు..!

శాలిగౌరారం, మనసాక్షి :

అగ్రనేత రాహుల్ గాంధీ పై ఈనెల 16వ తేదీన మహారాష్ట్ర సీఎం షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ చేసిన వాఖ్యలు వివాదస్పదకరంగా ఉన్నందున అతని పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా శాలిగౌరారం పోలీస్ స్టేషన్ లో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం సాయంత్రం పిర్యాదు చేశారు.

మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు, ఎమ్మెల్యే లు మందుల సామెల్, వేముల వీరేశంతో కలిసి పిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ నాలుక కోసిన వారికి 11 లక్షల రూపాయలు బహుమతి గా ఇస్తానని ప్రకటించడం విడ్డురంగా ఉందన్నారు. ఈ ద్వేషపూరిత వాఖ్యలు సమాజం లో దుష్ప్రవర్తనను ప్రొచహించే లక్ష్యంతో ఉందని, జాతీయ సమైక్యతను దెబ్బతీసే విధంగా ఉందంన్నారు.

ఈ వాఖ్యలు రాహుల్ గాంధీని చంపేందుకు కాంట్రాక్ట్ (సుపారీ ) ఇవ్వడం తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. దేశ సమగ్రతకు భంగం కలిగించే ఈ వాఖ్యల పై ఎఫ్ ఆర్ ఐ నమోదు చేసి ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని శాలిగౌరారం సీఐ కొండల్ రెడ్డి, ఎస్ ఐ డి. సైదులు కు ఇచ్చిన పిర్యాదు లో కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

LATEST UPDATE :

Komatireddy : తెలంగాణ రాష్ట్ర ఘనత అమరులదే.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!

Miryalaguda : మిర్యాలగూడలో వైభవంగా అభిషేకాలతో గణేష్ నిమజ్జనం.. పాల్గొన్న ఎమ్మెల్యే బిఎల్ఆర్..!

Ration Cards : కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. విధి విధానాలు.. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం..!

Ration Cards : కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. విధి విధానాలు.. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం..!

మరిన్ని వార్తలు