Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు

Miryalaguda : మిర్యాలగూడలో వైభవంగా అభిషేకాలతో గణేష్ నిమజ్జనం.. పాల్గొన్న ఎమ్మెల్యే బిఎల్ఆర్..!

Miryalaguda : మిర్యాలగూడలో వైభవంగా అభిషేకాలతో గణేష్ నిమజ్జనం.. పాల్గొన్న ఎమ్మెల్యే బిఎల్ఆర్..!

మిర్యాలగూడ , మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సోమవారం గణేష్ నిమజ్జనం వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాలలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహాల వద్ద లడ్డూల వేలం పాటలు సాగాయి. నిమజ్జను ఉత్సవ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు భత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. రెడ్డి కాలనీ కోదండ రామాలయంలో అభిషేకాలతో నిర్వహించిన గణేష్ నిమజ్జన కార్యక్రమం లో స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక శాసనసభ్యులు బిఎల్ఆర్ మాట్లాడుతూ వినాయకుని పూజించు కోవడం వల్ల మనం చేసే అన్ని పనులలో విజ్ఞాలన్ని తొలగిపోయి ఆ వినాయకుడి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో తులతూగాలని కోరుకుంటున్నాను అన్నారు.

నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ మట్టి గణపతి పూజలు చేసి పర్యావరణాన్ని కాపాడాలని, దేశ ప్రజలందరికీ మన మిర్యాలగూడ నియోజకవర్గం ఆదర్శప్రాయంగా ఉండాలని ఈ కోదండ రామాలయంలోని గణపతి మట్టి విగ్రహాన్ని ఆలయంలోని అభిషేకాలు చేయడం చాలా బాగుందన్నారు.

ఇదే విధంగా ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ గణపతి నిమజ్జనంలో పాల్గొనాలని, ఆ విధంగా ఉండటానికి మన పట్టణంలో మరియు పరిసర ప్రాంతాల్లో వచ్చే సంవత్సరం ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను తీసుకునే విధంగా అందరికీ చెప్పాలని వారన్నారు.

కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి కాలనీ కోదండ రామాలయంలో గణపతి విగ్రహాన్ని నవరాత్రులు పూజలు చేసి ఈరోజు గుడిలోని ఈశాన్యం మూలలో గణపతి ప్రతిమను ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఆవు పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, పంచదార, పంచామృతం , పన్నీరు, కొబ్బరి బోండాలు, పసుపు, కుంకుమ, విభూదిలతో అభిషేకిస్తూ నిమజ్జనం చేయడం జరిగిందన్నారు.

పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులను పైడిమర్రి నర్సింహారావు, మందడి రవీందర్ రెడ్డి, తాళ్ల వెంకట్ రెడ్డి, రంగా శ్రీధర్, ప్రముఖ వ్యాపారవేత్త పైడిమర్రి సురేష్, ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు గార్లపాటి పండిత్ రెడ్డి,

ఆలయ కమిటీ అధ్యక్షుడు పాదూరు ఇంద్రసేనారెడ్డి, కార్యదర్శి పుట్టా దయాకర్ రెడ్డి, బొజ్జమోహన్ రెడ్డి, మోహన్ రామ్ రెడ్డి, బండారు నరసింహ, నామిరెడ్డి రమేష్ రెడ్డి, కిషోర్ రెడ్డి, పసుపులేటి రాజు, ఓరుగంటి శివ, సముద్రాల మదన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

Ration Cards : కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. విధి విధానాలు.. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం..!

Komatireddy : రూ. 2000 కోట్లతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి ఆరు లైన్లుగా విస్తరణ..!

సెప్టెంబర్ 17న ఆస్టరాయిడ్ భూమిని ఢీకొనబోతుందా.. కలవర పడుతున్న మానవాళి..!

Rythu Barosa : 20న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై నిర్ణయం.. రైతు భరోసా ప్రారంభం అప్పుడే..!

మరిన్ని వార్తలు