TG News : మీ ఎమ్మెల్యే మీ ఊరిలో.. ఆ ఎమ్మెల్యే వినూత్నకార్యక్రమానికి శ్రీకారం..!
TG News : మీ ఎమ్మెల్యే మీ ఊరిలో.. ఆ ఎమ్మెల్యే వినూత్నకార్యక్రమానికి శ్రీకారం..!
దమ్మపేట, మన సాక్షి :
మీ ఎమ్మెల్యే మీ ఊరిలో.. అనే వినూత్న కార్యక్రమానికి ఆ ఎమ్మెల్యే .. ప్రజల వద్దనే గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి వెంటనే సమస్యలను పరిష్కరించారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
గిరిజన చెన్నాపురం గ్రామం దత్తత తీసుకున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ రచ్చబండ కార్యక్రమం నేరుగా అధికారులతో ప్రజల ముఖాముఖి అశ్వారావుపేట మండలం కన్నాపురం పంచాయతీ చెన్నాపురం గిరిజన గ్రామంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రతిష్టాత్మకంగా మీ ఎమ్మెల్యే మీ ఊరిలో అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజా పాలసీలో భాగంగా రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముందుగా ఈ గిరిజన గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు దత్తత తీసుకుంటున్నట్టు తెలిపారు అలాగే గ్రామస్తులను అధికారులను గ్రామంలో చెట్టు నీడన కూర్చోబెట్టి నేరుగా గిరిజనులకు అధికారులకు ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అడిగిన ప్రశ్నలకు వారి సమస్యలకు అధికారుల నుంచి వెంటనే సమాధానాలు రాబట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ ప్రజా పాలనలో భాగంగా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని చెన్నాపురం గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని గ్రామ ప్రజల ఆరోగ్య క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చెన్నాపురం గ్రామానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని జారే ఆదినారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత అధికారులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- Rythu Bharosa : రైతులకు అదిరే శుభవార్త.. ఎకరానికి 15000, రైతు భరోసా డేట్ ఫిక్స్..!
- దసరా సెలవుల డేట్స్ ఇవే.. ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!
- TG News : తెలంగాణ పేదలకు గుడ్ న్యూస్.. వారికి అక్టోబర్ లో ఇందిరమ్మ గృహాలు.. మంత్రి కోమటిరెడ్డి వెల్లడి..!
- Devarakonda : అయ్యా.. మా పిల్లలు ఎక్కడున్నారో చెప్పండి.. మిస్సింగ్ అయిన గురుకుల విద్యార్థుల తల్లిదండ్రుల మొర..!









