Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Devarakonda : మన సాక్షి కి స్పందన.. లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో అధికారుల విచారణ..!

Devarakonda : మన సాక్షి కి స్పందన.. లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో అధికారుల విచారణ..!

దేవరకొండ, మనసాక్షి :

నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ ప్రైమరీ స్కూల్లో శనివారం విద్యాశాఖ అధికారులు విచారణ చేశారు. పాఠశాల విద్యార్థులు ఫీజు చెల్లించలేదని యాజమాన్యం ఇంటికి పంపకపోవడంపై మన సాక్షి పత్రికలో ప్రచురితమైంది.

అందుకు స్పందించిన మండల విద్యాధికారి మాతృ నాయక్ శనివారం పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు చైత్ర, దానవి లతో మాట్లాడారు. అనంతరం పాఠశాల యాజమాన్యంతో మాట్లాడారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు రిపోర్టు పంపించనున్నట్లు ఆయన తెలిపారు.

ఉన్నతాధికారుల ఆదేశం మేరకు తాను పాఠశాలను సందర్శించానని, ఫీజు చెల్లించని విద్యార్థులను ఇంటికి పంపక పోవడం విషయంపై విద్యార్థులు, యాజమాన్యంతో మాట్లాడినట్లు పూర్తిస్థాయి రిపోర్టును ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి :

మరిన్ని వార్తలు