Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణపెద్దపల్లి జిల్లా

Job Mela : ఈనెల 28న జాబ్ మేళా.. వేతనం నెలకు రూ.17 వేలు..!

Job Mela : ఈనెల 28న జాబ్ మేళా.. వేతనం నెలకు రూ.17 వేలు..!

పెద్దపల్లి, ధర్మారం, మన సాక్షి ప్రతినిధి.

జిల్లాలోని నిరుద్యోగ యువకులకు హైదరాబాద్ లోని స్టాఫింగ్ టైటాన్స్ కంపెనీ లో ఉద్యోగాలు కల్పించుటకు ఈనెల 28న శనివారం రోజున ప్రభుత్వ ఐటిఐ కేంద్రం, పెద్దపల్లి నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతి రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

స్టాఫింగ్ టైటాన్స్ కంపెనీ హైదరాబాద్ లో 50 టెక్నీషియన్ పోస్ట్ లు ఖాళీలు ఉన్నాయని, ఏదైనా ఐటిఐ కోర్సు చదివిన వారు అర్హులని, వీరి వయస్సు 18 నుంచి 33 ఏళ్లు లోపు ఉండాలని తెలిపారు.

ఈ కంపెనీలో చేరిన వారికి వేతనం నెలకు 17 వేలు ఉంటుందని, ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 28న ఉదయం 11 గంటల సర్టిఫికేట్స్ జిరాక్స్ లతో ఐటిఐ కేంద్రానికి వచ్చి తమ పేరు నమెదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 8985336947, 8121262441 నందు సంప్రదించాలని జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతిరావు ఆ ప్రకటనలో తెలిపారు.

ఇవి కూడా చదవండి :

మరిన్ని వార్తలు