TOP STORIESBreaking Newsహైదరాబాద్

CM Revanth Reddy : పేదలకు సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త.. మెరుగైన వైద్యం కోసం నిర్ణయం..!

CM Revanth Reddy : పేదలకు సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త.. మెరుగైన వైద్యం కోసం నిర్ణయం..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ పేద ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ శుభవార్త తెలియజేశారు. పేద ప్రజలు వైద్యం కోసం ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టనున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుంది. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.

పేదలకు విద్య, వైద్యం భారం కాకుండా చూడాలని సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా హెల్త్ ప్రొఫైల్ కార్డుల ప్రక్రియ చేపట్టనున్నారు. నెల రోజుల్లో ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డుల ప్రక్రియను ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

అదేవిధంగా క్యాన్సర్ మహమ్మారితో పేద ప్రజలు అనేకమంది ఇబ్బందులు పడుతున్నారని, క్యాన్సర్ చికిత్స పేదలకు భారమవుతున్నందున క్యాన్సర్ వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా సభ లాంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు సూచించారు.

దుర్గాబాయ్ దేశ్ముఖ్ మహిళా సభ హాస్పిటల్ సేవల విస్తరణపై యాజమాన్యం తీసుకొచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి అమలు చేయడానికి ప్రయత్నిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దాంతో క్యాన్సర్ చికిత్స పేదలకు అందే విధంగా ప్రయత్నం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు