Chicken : చికెన్ కొంటున్నారా.. జర భద్రం, ఇది తప్పనిసరిగా చూసుకోవాలి..!

Chicken : చికెన్ కొంటున్నారా.. జర భద్రం, ఇది తప్పనిసరిగా చూసుకోవాలి..!
నేలకొండపల్లి, మన సాక్షి :
గల్లీకో చికెన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. చికెన్ రేట్లు కూడా ఎవరికి ఇష్టమైనవి వాళ్లు అమ్ముతున్నారు. పత్రికలలో వచ్చే చికెన్ రేట్ల ప్రకారం అమ్ముతున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారు. పత్రికలలో వచ్చే చికెన్ ధరలు ఆయా కంపెనీల అనుగుణంగా వచ్చేవి.. కానీ గల్లీలో ఏర్పాటు చేసే సాధారణ చికెన్ కు కూడా అదే రేటుతో విక్రయిస్తూ వినియోగదారులను దోచుకుంటున్నారు.
అంతేకాకుండా చనిపోయిన కోళ్లను విక్రయించడం, తూకంలో మోసం చేయడం షరా మామూలుగా సాగుతోంది. తనిఖీలు చేసే అధికారులు ఎక్కడా కనిపించడం లేదు.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని పలు చికెన్ దుకాణాలలో మనికి సూపించే కాటా వేరు ఇంటికెళ్లి పెట్టుకుంటే వచ్చే కాటా వేరు కేజీ కాటాకు 1000g ఉండాల్సింది పోయి 820 గ్రాములే వస్తుంది.
అంతేకాకుండా రాత్రి వేళల్లో సప్లై అవుతున్న టైంలో చనిపోయిన కోళ్లను రాత్రి కట్ చేసి తెల్లవారుజామున వాటిని విక్రయిస్తున్నారు. రోగంతో చనిపోయిన కోడిని కూడా వదలకుండా వినియోగదారులకు విక్రయిస్తున్నారు.
తూకంలో తేడా జరిగిన పరవాలేదు కానీ చనిపోయిన కోళ్లను సైతం వ్యాపారులు వదలటం లేదు. తనిఖీలు చేయాల్సిన అధికారులు చికెన్ లెగ్ పీసులతో పొట్ట నింపుకుంటున్నట్లు సమాచారం తూకం విషయంలో చనిపోయిన కోళ్ల విషయంలో వినియోగదారులు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.
వినియోగదారులు తమ ముందే కోడిని కోసి డ్రెస్సింగ్ చేసి ఇచ్చే విధంగా షాప్ యజమానులను అడగాల్సి ఉంది. నేలకొండపల్లి లో గల ఓ షాపులో దారుణం జరిగింది ఒక క్వింటా 20 కేజీల చికెన్ గాను 1.05 క్వింటా మాత్రమే వచ్చినది.
ఇంటికెళ్లి తూకం పెట్టి వినియోగదారుడు షాపు వద్దకు వెళ్లి గగ్గోలు పెట్టాడు. జర చూసి చికెన్ కొనుక్కోండి ప్రజలు అప్రమత్తంగా ఉండండి అని పలువురు కోరుతున్నారు.
MOST READ :
-
Viral Video : ఏం.. టీచరమ్మ రా బాబు.. క్లాస్ రూమ్ లోనే పిల్లలతో.. (వీడియో)
-
పోలీస్ కస్టడీలో తహసిల్దార్ విచారణ.. అక్రమార్కుల్లో ఆందోళన..!
-
Viral Video : కొత్త జంట ఫస్ట్ నైట్.. చీ చీ ఇలాంటి సన్నివేశాలు.. సోషల్ మీడియాలో వైరల్.. (వీడియో)
-
Viral Video : భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు.. భార్య చేసిన పనికి షాక్.. (వీడియో)









