పోలీస్ కస్టడీలో తహసిల్దార్ విచారణ.. అక్రమార్కుల్లో ఆందోళన..!
పోలీస్ కస్టడీలో తహసిల్దార్ విచారణ.. అక్రమార్కుల్లో ఆందోళన..!
మన సాక్షి , హుజూర్ నగర్ :
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ తహసిల్దార్ గా పని చేసి రైతుబంధు కుంభకోణంలో అరెస్ట్ అయిన జయశ్రీ ని పోలీసులు విచారణ చేస్తున్నారు. కోదాడ జూనియర్ సివిల్ కోర్టు అనుమతి మేరకు మూడు రోజుల పాటు తహసిల్దార్ వజ్రాల జయశ్రీని, ఆపరేటర్ జగదీష్ ను విచారణ చేస్తున్నారు.
మంగళవారం మొదటి రోజు, బుధవారం రెండవ రోజు పోలీసులు విచారణ చేశారు. విచారణ సందర్భంగా పలు కీలక అంశాలను పోలీసులకు ఆమె తెలియజేసినట్లు తెలిసింది. మొదటి రోజు అనారోగ్యంగా ఉందని తన వద్ద ఎలాంటి సమాచారం లేదని తెలిపినట్లు తెలిసింది.
కానీ బుధవారం రెండో రోజు తాసిల్దార్ జయశ్రీ అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల వివరాలను కూడా పోలీసులకు తెలియజేసినట్లు తెలిసింది. గరిడేపల్లి, మఠంపల్లి, హుజూర్ నగర్ మండలాల్లో పనిచేసిన సమయంలో కూడా అనేక అభియోగాలు ఉన్నవి. హుజూర్ నగర్ మండలంలోని లింగగిరి, శ్రీనివాసపురం గ్రామాలలో ప్రభుత్వ భూములు అక్రమార్కులకు కట్టబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అదేవిధంగా ప్రైవేటు వ్యక్తులకు కూడా భూములు కట్టబెట్టినట్లు సమాచారం. అంతేకాకుండా కొంతమంది వ్యవసాయ భూములను కూడా కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ఇతరులకు రిజిస్ట్రేషన్లు చేసిన దాఖలు కూడా ఉన్నట్లు సమాచారం. మూడు రోజులపాటు పోలీస్ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్న తహసిల్దార్ జయశ్రీ పలు కీలక అంశాలను బయటపెట్టినట్లు సమాచారం.
తహసిల్దార్ విచారిస్తున్న సమయంలో నిజాలు బయటికి వస్తాయని అక్రమార్కులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది. గురువారంతో ఆమె పోలీస్ కస్టడీ తహసిల్దార్ జయశ్రీ చెప్పిన వివరాల ప్రకారం ఉన్నతాధికారులు విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఆమె చెప్పిన ఆధారంగా మరికొంతమంది అక్రమార్కులని కూడా పోలీసులు అరెస్టు చేస్తారని ఆందోళన చెందుతున్నారు.
MOST READ :
-
Viral Video : అయ్య బాబోయ్.. ఎంత అదృష్టవంతురాలో ఆమె.. (వీడియో)
-
Viral Video : ప్రీవెడ్డింగ్ షూట్ లోనే అలా.. ఇదేం ఆత్రం రా నాయన.. (వీడియో)
-
Viral Video : ఏం.. టీచరమ్మ రా బాబు.. క్లాస్ రూమ్ లోనే పిల్లలతో.. (వీడియో)
-
Viral Video : కొత్త జంట ఫస్ట్ నైట్.. చీ చీ ఇలాంటి సన్నివేశాలు.. సోషల్ మీడియాలో వైరల్.. (వీడియో)









