Hyderabad : మియాపూర్ టు ఇస్నాపూర్ మెట్రో మార్గం.. ఒకే పిల్లర్ మీదుగా..!
Hyderabad : మియాపూర్ టు ఇస్నాపూర్ మెట్రో మార్గం.. ఒకే పిల్లర్ మీదుగా..!
శేరిలింగంపల్లి, మన సాక్షి :
మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు మెట్రో నిర్మాణంలో భాగంగా నాగపూర్ నమూనా ప్రకారం మెట్రో మార్గం ఫ్లై ఓవర్ ను ఒకే పిల్లర్ మీదుగా వచ్చే విధంగా నూతనంగా నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మంగళవారం పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో కలిసి మంత్రి శ్రీధర్ బాబుకు వినతిపత్రం అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు నాగపూర్ నమూనా ప్రకారం మెట్రో మార్గం ఫ్లై ఓవర్ ను ఒకే పిల్లర్ మీదుగా వచ్చే విధంగా నూతనంగా నిర్మాణం చేపట్టలేరని మంత్రిని కోరామని తెలిపారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాల కోసం, ట్రాఫిక్ రహిత సమాజం కోసం, ప్రజా సౌకర్యార్థం నూతనంగా నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గతంలో శాసన సభ సమావేశాలలో నేను మాట్లాడిన సంగతి విదితమే నని అన్నారు.
వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాలు అదే స్థాయిలో ఉండాలనే లక్ష్యంతో ప్రజారవాణాను విస్తృత పరచాలనే ఉద్దేశ్యంతో, నగరం ఎంత పెరిగినా.. ఎన్ని పరిశ్రమలు వచ్చినా.. లక్షలాది మంది ప్రజలు వచ్చినా తట్టుకునేలా.. విశ్వనగరంగా ఎదగడానికి, అన్నిహంగులతో కూడిన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు మెట్రోను నగరం నలువైపులా విస్తరించాలని తెలిపారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల ట్రాఫిక్ సమస్యల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అనేక ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు లింక్ రోడ్లు వంటి అభివృద్ధి చేయడం అంటే బహుశా 50 యేండ్ల చరిత్రలో ఇది మొట్టమొదటి సారని శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి ,మాకు గౌరవంగా ఉందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నానని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు.
అదేవిధంగా బ్రహ్మాండంగా ఫ్లై ఓవర్లు ,అండర్ బ్రిడ్జిలు, కొత్త రోడ్లు వేయడం జరిగినది అని పీఏసీ చైర్మన్ గాంధీ మంత్రి దుద్దిళ్ల బాబుకు తెలిపారు.ఈ విషయంపై మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు.
LATEST UPDATE :
-
Miryalaguda : దోమకాటుకు పురుగు మందు చల్లితే.. ఉన్న పొలం ఎండిపోయింది, రైతు కుటుంబం ధర్నా..!
-
District collector : ప్రభుత్వ ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ వార్నింగ్..!
-
Nalgonda : అద్దంకి – నార్కట్ పల్లి రహదారిపై పోలీస్ కుటుంబ సభ్యుల రాస్తారోకో..!
-
Miryalaguda : అర్ధరాత్రి వెళితే తిరస్కరించిన వేళ.. కట్ చేస్తే సన్మానం..!









