Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Hospital : పేషెంట్స్ ఫుల్.. డాక్టర్స్ నిల్..!

Hospital : పేషెంట్స్ ఫుల్.. డాక్టర్స్ నిల్..!

దేవరకొండ : నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సమయానికి రాకపోవడంతో పేషెంట్లు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతిరోజు ఇదే తంతు కొనసాగుతోంది.

ఉదయం 9 గంటలకు రావలసిన వైద్యులు 10 గంటలైనా రావడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్యులు సమయపాలన పాటించడం లేదు. దూరప్రాంతాల నుంచి వివిధ తండాల నుంచి గిరిజనులు ఆసుపత్రికి ప్రతిరోజు వస్తు ఉంటారు.

వైద్యులు సమయానుకూలంగా వారికి వైద్యం అందించకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లా కలెక్టర్ ఆసుపత్రిని తనిఖీ చేసి వైద్యుల పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించినప్పటికీ కూడా వైద్యుల తీరులో మార్పు రాలేదు.

బుధవారం 10 గంటల వరకు కూడా వైద్యులు ఆసుపత్రికి రాకపోవడంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు గంటల తరబడి ఎదురు చూశారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు