Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : విద్యుత్ షాక్ తో రైతు మృతి..!

Miryalaguda : విద్యుత్ షాక్ తో రైతు మృతి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ శాఖ తో రైతు మృతి చెందిన సంఘటన మిర్యాలగూడ మండలంలో గురువారం చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన నల్లగంతుల ఎల్లయ్య (40) కౌలుకు చేస్తూ, పొలంలో మోటరు ఆన్ చేయుటకు వెళ్లడం ద్వారా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలింది.

హాస్పిటల్ కు మిర్యాలగూడెం తరలించగా డాక్టర్ పరిశీలించి మరణించినాడని తెలియజేయడం జరిగినది. మృతదేహాన్ని , మిర్యాలగూడకు గవర్నమెంట్ హాస్పటల్ తరలించనైనది. మృతుని భార్య రేణుక ఇచ్చిన దరఖాస్తు పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడమైనది .మృతునికి ఇద్దరూ కుమార్తెలు కలరు.

LATEST UPDATE :

మరిన్ని వార్తలు