UPI : యూపీఐ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారా.. అయితే కొత్త రూల్స్ నేటి నుంచే.. తెలుసుకోండి..!
UPI : యూపీఐ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారా.. అయితే కొత్త రూల్స్ నేటి నుంచే.. తెలుసుకోండి..!
మన సాక్షి , వెబ్ డెస్క్ :
ఇటీవల కాలంలో ఎక్కువమంది లావాదేవీలన్నీ యూపీఐ ద్వారానే చేస్తున్నారు. నగదు రహిత చెల్లింపులను కొనసాగిస్తున్నారు. 10 రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు కూడా యూపీఐ ద్వారానే పేమెంట్స్ చేస్తున్నారు. అయితే యూపీఐ లావాదేవీలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఎప్పటికప్పుడు నిబంధనలు మార్చుతూ ఉంటుంది. ఎక్కువగా యూపీఐ ద్వారా పేమెంట్ చేసేవారు ఈ నిబంధనలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంది.
యూపీఐ (UPI) చెల్లింపుల్లో కొత్త నిబంధనలు నవంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తున్నాయి. ఈ నిబంధన ప్రకారం యూపీఐ లైట్ ద్వారా 1000 రూపాయల వరకు లావాదేవీలు చేయవచ్చును. మీ వాలెట్ లో 5000 రూపాయల వరకు బ్యాలెన్స్ ను ఉంచుకోవచ్చును.
ఆటో టాప్ ఫీచర్ తో మీ బ్యాలెన్స్ తక్కువగా ఉన్నప్పుడు మీ బ్యాంకు ఖాతా నుంచి యూపీఐ లైట్ లోకి ఆటోమేటిక్ గా డబ్బులు వస్తాయి.
అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. యూపీఐ లైట్ లావాదేవీల పరిమితిని కూడా పెంచింది. నవంబర్ 1వ తేదీ నుంచి కస్టమర్లు యూపీఐ లైట్ ద్వారా ఎక్కువ చెల్లింపులు చేయవచ్చును. యూపీఐ లైట్ అనేది పిన్ (PIN) ఉపయోగించకుండా చిన్నచిన్న లావాదేవీలు చేయడానికి కస్టమర్లకు అనుమతించే ఒక వాలెట్. ప్రస్తుతం యుపిఐ లైట్ కస్టమర్లు చెల్లింపులకు కొనసాగించడానికి బ్యాంకు ఖాతా నుంచి వారి వాలెట్లోకి బ్యాలెన్స్ ని మాన్యువల్ గా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంది.
కానీ కొత్త నిబంధన ప్రకారం మాన్యువల్ రీఛార్జ్ అవసరాన్ని లేకుండా ఆటో టాప్ ఫీచర్ ను తీసుకొచ్చింది.ఆటో యూపీఐ లైట్ బ్యాలెన్స్ లేకుండా మీ బ్యాంకు ఖాతాలో ఉన్న అమౌంట్ ను ఆటోమేటిక్ గా యూపీఐ లైట్ లోకి జమ చేయబడతాయి. దానివల్ల చిన్న చిన్న పేమెంట్స్ ఇబ్బందులు లేకుండా ఉంటుంది.
MOST READ :
-
Gold Price : గోల్డెన్ డేస్.. దీపావళికి మరోసారి షాక్, తులం బంగారం ధర ఎంతంటే..!
-
Viral Video : స్కానింగ్ మిషన్ లోకెళ్లినా.. ఇదేంది సామీ.. తగ్గేదే లేదంటున్న పెద్దాయన.. (వీడియో)
-
Diwali : దీపావళి అనే ఊరు ఉంది తెలుసా..? అది ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రాల్లోనే..!
-
Suryapet : శ్రీనిధిలో భారీగా అవకతవకలు.. రూ.40 లక్షల పక్కదారి..!









