Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం

Miryalaguda : మిల్లర్ల సిండికేట్.. ధాన్యం ధరలు తగ్గింపు, రహదారిపై రైతుల ఆందోళనలు..!

Miryalaguda : మిల్లర్ల సిండికేట్.. ధాన్యం ధరలు తగ్గింపు, రహదారిపై రైతుల ఆందోళనలు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైస్ మిల్లర్లు సిండికేట్ అయ్యారు. మిల్లులో విక్రయించుకునే రైతుల ధాన్యం కు కనీస మద్దతు ధరలు కూడా చెల్లించడం లేదు. రైతుల ధాన్యం కు మద్దతు ధర చెల్లించాలని స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, అడిషనల్ జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

అయినా కూడా మిల్లర్లు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడం లేదు. దాంతో మిర్యాలగూడ సమీపంలోని యాద్గార్ పల్లి, వేములపల్లి మండలం శెట్టిపాలెం లో రహదారిపై రైతులు ధాన్యం ట్రాక్టర్లు అడ్డుపెట్టి రాస్తారోకో చేశారు.

రైతులు రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. వారిని పోలీసులు, వ్యవసాయ అధికారులు వారించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా నిరసన కొనసాగించారు. సన్నధాన్యంకు క్వింటా రూ. 2200 నుంచి రూ. 2300 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

సందర్శించిన ఎమ్మెల్యే :

ధాన్యం విక్రయాలు జరుగుతున్న నేపథ్యంలో ధాన్యం సేకరణ కేంద్రాలతో పాటు రైస్ మిల్లులను స్థానిక శాసనసభ్యులు భత్తుల లక్ష్మారెడ్డి ఆదివారం సందర్శించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని ఆదేశించారు. అయినా కూడా ఎమ్మెల్యే ఆదేశాలు పట్టణ మిల్లర్లు మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు