Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : ట్రాక్టర్ ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు మహిళ మృతి.. పలువురికి గాయాలు..! 

Miryalaguda : ట్రాక్టర్ ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు మహిళ మృతి.. పలువురికి గాయాలు..! 

దామరచర్ల, మనసాక్షి :

నల్గొండ జిల్లా దామరచర్ల లో ఘోర ప్రమాదం సంబంధించింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ట్రాక్టర్ ను ఢీ కొట్టింది.  ఈ సంఘటనలో మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

దామరచర్ల మండల కేంద్రంలోని వాడపల్లి గ్రామ శివారులోని చెక్ పోస్ట్ వద్ద ఆదివారం తెల్లవారు జామున కావేరి ట్రావెల్స్ బస్సు ట్రాక్టర్ ను ఢీ కొట్టింది.

దామరచర్ల మండలం బొత్తలపాలెం నుండి ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను వెనుక నుంచి వస్తున్న NL 02B 3037 నంబరు గల కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో మంద విమలమ్మ అనే మహిళ అక్కడికక్కడే చనిపోగా డ్రైవర్ అఖిల్, పోలేపల్లి బంగారమ్మ, నందిపాటి ఎల్లమ్మ తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు డ్రైవరు నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలియజేశారు. ఈ ఘటనపై వాడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

LATEST UPDATE :

మరిన్ని వార్తలు