Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : అక్రమంగా తరలిస్తున్న గోవుల పట్టివేత.. కేసు నమోదు..!

Miryalaguda : అక్రమంగా తరలిస్తున్న గోవుల పట్టివేత.. కేసు నమోదు..!

మాడుగులపల్లి, మన సాక్షి :

అక్రమంగా పశువులను తరలిస్తున్న వారి పైన కేసు నమోదు చేసిన ఘటన మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారు జామున ఐదు గంటల సమయంలో రెండు డీసీఎం లు కొద్ది సమయం తేడాలో అనుమానస్పాదంగా కనిపించగా ఆపి చూడగా రెండు డీసీఎంలలో సుమారుగా 107 పశువులు వున్నట్లుగా గుర్తించారు.

రెండు డీసీఎంల యొక్క డ్రైవర్లు అయిన రామావత్ మోహన్, నేనావత్ రఘు లను విచారించగా, ఆ రెండు వాహనాల యొక్క ఓనర్స్ అయిన నేనావత్ శ్రీను, వడ్త్య శంకర్ ల యొక్క ఆదేశాల మేరకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా హనుమాన్ జంక్షన్ నుండి పశువులకు కనీస అవసరాలను కూడా కల్పించకుండా హైదరాబాద్ లోని కబేళాలకు తరలిస్తున్నామని చెప్పడం జరిగింది.

కావున పశువులను అక్రమ రవాణా చేస్తున్నటువంటి డీసీఎం డ్రైవర్ల పైన పశువులను అక్రమ రవాణా చేయిస్తూ వ్యాపారం చేస్తున్నటువంటి డీసీఎం ఓనర్ల పైన కేసు నమోదు చేసి ఆ గోవులను వేములపల్లి, ధర్మపురం గోశాలలకు తరలించినట్లు మాడుగులపల్లి ఎస్సై కృష్ణయ్య తెలిపినారు.

MOST READ : 

మరిన్ని వార్తలు