Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : బైక్ అదుపు తప్పి.. వ్యక్తి మృతి..!
Miryalaguda : బైక్ అదుపు తప్పి.. వ్యక్తి మృతి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
టు వీలర్ అదుపుతప్పి కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మిర్యాలగూడ మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం..
మిర్యాలగూడ మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన గౌని యాదగిరి (59) శనివారం టీవీఎస్ ఎక్సెల్ పై మిర్యాలగూడ వెళ్తున్నాడు. గ్రామం నుంచి మిర్యాలగూడ వస్తుండగా కిష్టాపురం వద్ద అద్దంకి నార్కట్ పల్లి రహదారిపై అదుపుతప్పి కింద పడిపోయాడు.
తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్ కు తరలించి చికిత్స పొందుతుండగా ఆదివారం మృతి చెందాడు. మృతుడి కుమారుడు జనార్ధన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
MOST READ :
-
Rythu : రైతులకు అదిరిపోయే న్యూస్.. రేపే ఖాతాలోకి డబ్బులు..!
-
Jobs : నిరుద్యోగులకు శుభవార్త.. టెన్త్ అర్హత ఉంటే చాలు.. కోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం..!
-
Accident : నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం.. మహిళ మృతి, గ్రామస్తుల ఆందోళన..!
-
Forest Jobs : రాత పరీక్ష లేకుండా అటవీ శాఖలో ఉద్యోగాలు.. నెలకు రూ.31 వేల వేతనం..!









