Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsఉద్యోగం

Jobs Notification : తెలంగాణ డిసిసిబి లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా ఎంపిక, నెలకు రూ.25 వేల జీతం..!

Jobs Notification : తెలంగాణ డిసిసిబి లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా ఎంపిక, నెలకు రూ.25 వేల జీతం..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణ స్టేట్ కోపరేటివ్ అపెక్స్ బ్యాంకు ద్వారా ఉద్యోగ ప్రకటన వెలువడింది. నోటిఫికేషన్ లో వివరాల ప్రకారం.. కోపరేటివ్ ఇంటర్న్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణ స్టేట్ కోపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లో కాంట్రాక్టు ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఇంటర్న్స్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వెలువడింది.

ఈ ప్రకటన ద్వారా 10 ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వాటిలో 9 ఖాళీలు డిస్ట్రిక్ట్ సెంటర్ కోఆపరేటివ్ బ్యాంక్ డిసిసిబి లో ఉన్నాయి. దానికి అర్హత ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఈనెల (నవంబర్ 30)వ తేదీ వరకు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చును.

అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ https://tscab.org/చూడొచ్చు.

మొత్తం ఖాళీలు 10 :

తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు లో ఒకటి, డి సి సి బి (డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకు)లో 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందుకుగాను సంబంధిత విభాగంలో ఎంబీఏ (మార్కెటింగ్/ కోపరేటివ్/ అగ్రి బిజినెస్/ రూరల్ డెవలప్మెంట్), పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. 21 నుంచి 30 సంవత్సరాల వయసు మధ్యలో కలిగిన వాళ్ళే ఉండాలి. వీరికి నెలకు 25 వేల వేతనం ఇవ్వనున్నారు.

ఎంపిక :

విద్యార్హతలు సాధించిన మార్కుల ఆధారంగా ఎలాంటి రాత పరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తెలంగాణలోని ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ ప్రాంతాలలో పనిచేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం :

ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. డిప్యూటీ జనరల్ మేనేజర్. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, ది తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ట్రూప్ బజార్, హైదరాబాద్ చిరునామాకు పంపాలి. నవంబర్ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

MOST READ : 

మరిన్ని వార్తలు