Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రీడలుజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

District Collector : నల్గొండలో ఈశా గ్రామోత్సవం.. ప్రారంభించిన జిల్లా కలెక్టర్..!

District Collector : నల్గొండలో ఈశా గ్రామోత్సవం.. ప్రారంభించిన జిల్లా కలెక్టర్..!

నల్లగొండ :
ఈశా గ్రామోత్సవం ద్వారా నల్గొండ జిల్లాలోని మహిళలు, వాలంటీర్లలో స్ఫూర్తిని పెంపొందింప చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. శనివారం ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించిన ఈశా గ్రామోత్సవం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు .

నల్గొండ జిల్లాలో ఈశా గ్రామోత్సవం నిర్వహించడం సంతోషమని ,అందుకు కలెక్టర్ ఈశా ఫౌండేషన్ ను అభినందించారు. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ఈశా గ్రామోత్సవ్ లో గెలుపొందిన వారు రాష్ట్ర స్థాయికి, తదనంతరం జాతీయ స్థాయికి వెళ్తే అక్కడ 5 లక్షల రూపాయల ప్రైజ్ మనీ పొందవచ్చు అని తెలిపారు.

జిల్లా నుంచి పాల్గొంటున్న క్రీడాకారులు నల్గొండ జిల్లాకు బహుమతి తీసుకువచ్చే విధంగా చూడాలని కోరారు. మనస్ఫూర్తితో, చిత్తశుద్ధితో పనిచేస్తే తప్పనిసరిగా ఏదైనా సాధ్యమవుతుందన్నారు. కోయంబత్తూర్ లో ఉన్న ఈశా అతిపెద్ద కేంద్రాన్ని సందర్శించే విధంగా జిల్లా మహిళలు, వాలంటీర్లను ఉచితంగా తీసుకు వెళ్లేలా ఈశా ఫౌండేషన్ చర్యలు తీసుకోవాలని, దాని ద్వారా నల్గొండ జిల్లాలో మహిళలు క్రీడాకారులకు మంచి స్ఫూర్తి వస్తుంది అని అన్నారు .

నల్గొండ జిల్లాను దక్షిణ భారతదేశంలో ఒక మంచి గుర్తింపు వచ్చేలా చూడాలని ఆమె కోరారు. జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల అధికారి సి.హెచ్. విష్ణుమూర్తి, జిల్లా పౌర సంబంధాల ఆధికారి యు.వెంకటేశ్వర్లు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు ప్రసాద్, ఏచూరి శైలజ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన వాలీబాల్, జడ కోలాటం కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ పాల్గొని మహిళలకు స్ఫూర్తిని ఇచ్చారు.

MOST READ : 

మరిన్ని వార్తలు