TOP STORIESBreaking Newsజాతీయం

WhatsApp : వాట్సాప్ కాల్స్ మాట్లాడుతున్నారా.. అయితే చిక్కుల్లో పడ్డట్టే, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..!

WhatsApp : వాట్సాప్ కాల్స్ మాట్లాడుతున్నారా.. అయితే చిక్కుల్లో పడ్డట్టే, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ యూజర్స్ సంఖ్య కోట్లాది మంది ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మెసేజింగ్ యాప్ ఎంతో ఆదరణ పొందింది. కేవలం భారతదేశంలోనే 550 మిలియన్లకు పైగా వాట్స్అప్ వినియోగదారులు ఉన్నారు. అయితే వాట్సప్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వినియోగదారులకు అందుబాటులో తీసుకొస్తున్న విషయం తెలిసిందే.

ఫోటోలు, వీడియోలు, సమాచారం అతి సులభంగా అతి త్వరగా షేర్ చేయడానికి ఎక్కువగా వాట్సాప్ లో వినియోగిస్తుంటాం. అంతే కాకుండా వాట్సాప్ లో వీడియో కాల్స్, ఆడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. అయితే వాట్సాప్ ద్వారా డిజిటల్ మోసాలు బాగా జరుగుతున్నాయని ఇటీవల కాలంలో కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి.

వాట్సప్ సురక్షితమైన మెసేజ్ యాప్ అని చెబుతున్నప్పటికీ కొన్ని పొరపాట్లు సమస్యలకు దారితీస్తున్నాయి. అయితే వాట్సాప్ వినియోగదారులకు ఇటీవల కొత్త సమస్య వచ్చి పడింది. వాట్సాప్ ఆడియో, వీడియో కాల్స్ ఎక్కువగా మాట్లాడుతున్నారు.

అయితే మాట్లాడేవారు చిక్కుల్లో పడ్డట్టే. వీడియో, ఆడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు మన లొకేషన్ ట్రాక్ చేయవచ్చును. ఇది మన ప్రైవసీకి చాలా ఆటంకంగా ఉంటుంది. మనం ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నామనే విషయం అవతలి వాళ్లకు ఈజీగా తెలిసిపోతుంది. ఇది ఈ విషయం లొకేషన్ ట్రాక్ చేసే వాళ్లకు ఈజీగా ఉంటుంది.

లొకేషన్ ట్రాక్ కాకుండా చూసుకోవాలంటే వినియోగదారులు జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. అయితే వాట్సాప్ ఆడియో కాల్ లేదా వీడియో కాల్ చేస్తున్నప్పుడు మన లొకేషన్ ట్రాక్ చేయకుండా ఉండాలంటే మనం సెట్టింగ్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. దాని ద్వారా సమస్యను మనం పరిష్కరించుకోవచ్చును.

వాట్సాప్ కాల్ లో ఐపీ అడ్రస్ ప్రొటెక్ట్ అనే ఫీచర్ ఉంటుంది. ఈ ఫీచర్ ను అవైలబుల్ చేయడం ద్వారా కాల్స్ సమయంలో ఈ లొకేషన్ ట్రాక్ అవ్వకుండా అడ్డుకోవచ్చును. వెంటనే మీరు మీ ఐపి అడ్రస్ అవైలబుల్ చేయండి.

MOST READ : 

మరిన్ని వార్తలు