Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : నల్గొండ జిల్లాలో మోడల్ స్కూల్ విద్యార్థులకు అస్వస్థత..!

Nalgonda : నల్గొండ జిల్లాలో మోడల్ స్కూల్ విద్యార్థులకు అస్వస్థత..!

దేవరకొండ, మనసాక్షి :

నల్గొండ జిల్లా దేవరకొండ ఆదర్శ పాఠశాలలో 5 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత విద్యార్థులకు తీవ్ర కడుపునొప్పి రావడం జరిగింది. గమనించిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువెళ్లారు.

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే తల్లిదండ్రులు హుటాహుటిన పాఠశాలకు వెళ్లడం జరిగింది. వెంటనే విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది.

5 మంది విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. వైద్యలు.. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం…

నేనావత్ అనూష (9వ తరగతి )  ఉక్కర్ కర్ అనన్య (9వ తరగతి), ఇస్లావత్ అనూష (9వ తరగతి) వడ్త్య మంగ్త (6వ), సంపంగి ఉదయ్ (6వ తరగతి) విద్యార్థులకు గురువారం పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత విపరీతమైన కడుపు నొప్పి తో బాధపడుతుండగా ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యం వహిస్తున్న బాధ్యుల పైన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్, యు ఎస్ ఎఫ్ ఐ, ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు..

ఇవి కూడా చదవండి : 

మరిన్ని వార్తలు