Nalgonda : అయ్యప్ప స్వామి దేవాలయంలో వైభవంగా మండల పూజ మహోత్సవాలు..!
Nalgonda : అయ్యప్ప స్వామి దేవాలయంలో వైభవంగా మండల పూజ మహోత్సవాలు..!
నల్లగొండ, .మన సాక్షి :
శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం మండల పూజ మహోత్స వాలు ఘనంగా నిర్వహించారు, రెండు రోజులపాటు జరిగే పూజా కార్యక్రమాలలో అభిషేకాలు యజ్ఞాలు విశేషంగా గా నిర్వహించారు. పట్టణంలోని రామగిరి శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మండల పూజా మహోత్సవాలు భాగంగా అయ్యప్ప స్వామికి మహాభిషేకం ఘనంగా నిర్వహించారు.
అనంతరం శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి అభిషేకాలు పుష్పాభిషేకం పాలాభిషేకం కనకాభిషేకం నిర్వహించి స్వామివారి పూలమాల ను భక్తులు అధిక సంఖ్యలో పాడి కైవసం చేసుకున్నారు కలశం అశోక్ స్వామి ఆధ్వర్యంలో భోజన కార్యక్రమాలు నిర్వహించి పంచామృతాభిషేకాలు నిర్వహించిఅనంతరం విచ్చేసిన మహిళా భక్తులు స్వాములకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కొలనుపాక రవికుమార్ మాట్లాడుతూ రెండు రోజులపాటు నిర్వహించిన పూజ మహోత్సవాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నదాన ప్రభు గా ఉన్నారని తెలిపారు. మండల పూజల నిర్వహణకు భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు అందజేశారని మండల పూజా మహోత్సవాల నిర్వాహనకు సహకరిస్తున్న అందరికీ అయ్యప్ప స్వామి కృప ఉండాలని ప్రార్థించారు. స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకాలు లక్షబిల్వర్చన సహస్రనామార్చన వంటి కార్యక్రమాలు నిర్వహించామని భక్తులు స్వాములు అయ్యప్ప స్వామి కృపను పొందాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ అనిల్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు చైర్మన్ కొలనుపాక రవికుమార్ ,ప్రధాన గురుస్వామి నోముల శ్యాము, ఉప గురుస్వామి కలసం అశోక్ ,అధ్యక్షుడు బండారు వెంకటేశ్వర్లు ,అల్లివెను. బొడ్డు శంకర్ .ప్రధాన కార్యదర్శి కలగోని కొండల్ .కోశాధికారి బూరు గూ బాల మల్లయ్య. కార్యవర్గ సభ్యులు తాతా లక్ష్మీ నరసింహ. మేడం విశ్వ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.









