తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుములుగు జిల్లా

ఆదివాసి పోడు రైతులకు పట్టాలివ్వాలి..!

ఆదివాసి పోడు రైతులకు పట్టాలివ్వాలి..!

వెంకటాపురం, మన సాక్షి :

ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామచంద్రపురం గ్రామంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ వెంకటాపురం మండల ఉపాధ్యక్షులు తాటి రాంబాబు అధ్యక్షనలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం అనేక సంక్షేమ చట్టాలను రూపుందించారు.

అయినప్పటికీ ఆచరణలో ఈ చట్టాలన్నీ ఘోరంగా విప్లమయ్యాయి అని వాపోయారు. 5వ షెడ్యూల్ భూభాగంలో 1/70 చట్టం అమల్లో ఉన్నప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసుల అభివృద్ధి చేసే క్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ఆదివాసుల పోడు భూములపై ఆదివాసులకు హక్కు కల్పించమని అడిగితే ఫారెస్ట్ అధికారులతో కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దౌర్జన్యంగా దుర్మార్గంగా వ్యవహరించి పోడు భూములను నుంచి గెంటివేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రామచంద్రపురం, ముత్తారం, తిప్పాపురం, సీతారాంపురం గ్రామాలలో ఆదివాసులు సాగు చేస్తున్న పోడుపోములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మడకం రమేష్ ,కుమ్మ సురేష్ కోర్స సారయ్య, తాటి శ్రీను, సోడి రాజు, మడకం దేవి, కుంజ జానకి తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు