Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsవైద్యంహైదరాబాద్

Gold Price : న్యూ ఇయర్ కు భారీ శుభవార్త.. రూ.4400 తగ్గిన బంగారం ధర..!

Gold Price : న్యూ ఇయర్ కు భారీ శుభవార్త.. రూ.4400 తగ్గిన బంగారం ధర..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

కొత్త సంవత్సరానికి పసిడి ప్రియులకు శుభవార్త అందింది. కొత్త సంవత్సరానికి ఒక రోజు ముందు బంగారం కొనుగోలుకు మహిళలు ఆసక్తి కనబరుచుతున్నారు. బంగారంలో హెచ్చుతగ్గులు ఇటీవల కొనసాగుతున్నాయి. కాగా మంగళవారం ఒక్కరోజే 100 గ్రాముల బంగారం కు 24 క్యారెట్ కు రూ.4400 తగ్గింది. 22 క్యారెట్స్ కు రూ.100 గ్రాములకు 4వేల రూపాయలు తగ్గింది.

భారీగా తగ్గడంతో పసిడి ప్రియులు కొనుగోలు పట్ల ఆసక్తి కనబరుచుతున్నారు. 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం సోమవారం 7,80,000 ఉండగా మంగళవారం 7,75,600 రూపాయలు ఉంది. రూ. 4400 పెరిగింది. అదేవిధంగా 100 గ్రాముల 22 క్యారెట్స్ సోమవారం 7,15,000 ఉండగా 4వేల రూపాయలు తగ్గి 7,11,000 రూపాయలుగా ఉంది.

హైదరాబాదులో 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం బంగారం) మంగళవారం 71,100 రూపాయలు ఉండగా 24 క్యారెట్స్ 10 గ్రాముల (తులం బంగారం) 77,560 ఉంది.హైదరాబాదులో కొనసాగుతున్న బంగారం ధరలే తెలుగు రాష్ట్రాలలో ప్రధాన పట్టణాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అదే విధంగా మంగళవారం వెండి ధర కిలో కు 1900 రూపాయలు తగ్గింది. కిలో వెండి కి మంగళవారం 98 వేల రూపాయలు ఉంది.

MOST READ :

మరిన్ని వార్తలు