Breaking Newsఉద్యోగంఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల కోసం.. సూపర్ చెక్ సర్వే..!

Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల కోసం.. సూపర్ చెక్ సర్వే..!

నేలకొండపల్లి, మన సాక్షి:

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని ఇందిరమ్మ ఇళ్ల సూపర్ చెక్ సర్వే ను నేలకొండపల్లి ఎంపీడీఓ యం.యర్రయ్య నిర్వహించారు. గురువారం మండలం లోని తిరుమలాపురం, కొత్తకొత్తూరు, ఆజయ్ తండా, ముజ్జుగూడెం, అనాసాగారం, సదాశివాపురం గ్రామాలలో సూపర్ చెక్ సర్వే ను చేపట్టారు.

స్వయంగా దరఖాస్తుదారుల తో మాట్లాడి…వివరాలు సేకరించారు. గతంలో సర్వేలో ఇచ్చిన వివరాలలో తేడాలు ఉన్నాయా లేదా అని సమీక్షించారు. ఫోటోలను కూడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాప్ లో బంధించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు…గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తైయిన గ్రామాలలో సూపర్ చెక్ సర్వే ను చేస్తున్నట్లు తెలిపారు. ప్రతీ గ్రామంలో ఉన్న ఇళ్ల లో 5 శాతం ఇళ్ల ను స్వయంగా ఎంపీడీవో ర్యాండమ్ సర్వే చేయాలని ఆదేశాల మేరకు చేపట్టినట్లు తెలిపారు.

సర్వే బృందాలు చేపట్టిన నమోదు లో ఎమైనా తప్పులు ఉన్నాయా లేదా అనే విషయాలను స్వయంగా ఎంపీడీఓ యాప్ లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్క రోజే 80 ఇళ్ల సర్వే పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శివ. ఆయా పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు