Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

అనతి కాలంలోనే మన సాక్షి కి జనాదరణ..!

అనతి కాలంలోనే మన సాక్షి కి జనాదరణ..!

దేవరకొండ, మనసాక్షి :

వార్త సమాచారం వేగంగా అందించడంలో మన సాక్షి ముందుంటుందని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. మన సాక్షి దినపత్రిక 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను దేవరకొండ పట్టణంలో మార్కెట్ యార్డ్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బాలు నాయకుక్ గురువారం ఆవిష్కరించారు. నూతన సంవత్సర క్యాలెండర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మన సాక్షి యాజమాన్యానికి సిబ్బంది పాఠకులకు..దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మీడియా రంగంలో సాంకేతికతను అందిపుచ్చుకొని మెరుపు వేగంతో వార్తల అందిస్తూ.. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న మన సాక్షి దినదినాభివృద్ధి చెంది మరిన్ని సేవలందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వెంకటయ్య గౌడ్.మాజీ ఎంపీపీ బిక్కు నాయక్.యూవజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కొర్ర రాంసింగ్ నాయక్. చందంపేట మండల అధ్యక్షులు సాయి రాథోడ్.వెంకట్.తదితరులు ఉన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు