TOP STORIESBreaking Newsసంక్షేమంహైదరాబాద్

Rythu Bharosa : రైతు భరోసా ప్రారంభం నేడే.. అమలు ఎప్పుడో తెలుసా.. బిగ్ అప్డేట్..!

Rythu Bharosa : రైతు భరోసా ప్రారంభం నేడే.. అమలు ఎప్పుడో తెలుసా.. బిగ్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నాలుగు సంక్షేమ పథకాలను గణతంత్ర దినోత్సవం (జనవరి 26)న ప్రారంభించనున్నది. మరికొన్ని గంటల్లో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా జిల్లాలో నియోజకవర్గాలలో నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించనున్నారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే నాలుగు సంక్షేమ పథకాలలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల మంజూరు చేయనున్నారు.

ఇదిలా ఉండగా ఈ నాలుగు సంక్షేమ పథకాలను జనవరి 26వ తేదీన ప్రారంభించినప్పటికీ వాటిని ఎప్పటినుంచి అమలు చేస్తారనే విషయంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. సంక్షేమ పథకాల అమలుపై ముఖ్యమంత్రితో సమీక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని నాలుగు సంక్షేమ పథకాలను లాంచనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.

జనవరి 26వ తేదీన ఈ పథకాలను ప్రారంభించినప్పటికీ ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఆయా పథకాల అమలు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి నెలాఖరు వరకు ఈ నాలుగు సంక్షేమ పథకాల అమలు చేపట్టనున్నారు.

అమలు ఆలస్యం ఎందుకంటే..?

ప్రభుత్వం చేపట్టబోయే నాలుగు సంక్షేమ పథకాల కోసం గతంలో వచ్చిన దరఖాస్తులలో అధికారులు సర్వేలు నిర్వహించారు. సర్వేల ఆధారంగా లబ్ధిదారులను అర్హులను ఎంపిక చేసి గ్రామసభలలో జాబితాలు ప్రదర్శించారు. ఆయా జాబితాలలో తమ పేర్లు లేవంటూ రాష్ట్రవ్యాప్తంగా అధికారులను ప్రజలు నిలదీశారు.

దాంతో మరోసారి లబ్ధిదారుల నుంచి గ్రామసభలలో దరఖాస్తులు స్వీకరించారు. గ్రామసభలలో స్వీకరించిన దరఖాస్తులను కూడా ఈ వారం రోజులపాటు పరిశీలించి అర్హులను ఎంపిక చేయనున్నారు. అందుకుగాను సంక్షేమ పథకాలు అమలు మరోవారం రోజులు పట్టే అవకాశం ఉంది.

MOST READ : 

  1. PDS : డీలర్లే రేషన్ బియ్యం దందా.. భారీగా పట్టివేత.. ఇద్దరు డీలర్ల పై కేసు నమోదు..!

  2. Miryalaguda : ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం.. లక్షల్లో వసూలు.. ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్..!

  3. Rythu Bharosa : రైతు భరోసా కు కావల్సినవి ఇవే.. వారికే పంట సహాయం.. లేటెస్ట్ అప్డేట్..!

  4. TG News : పింఛన్ దారులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే న్యూస్.. త్వరలో అర్హుల ఎంపిక..!

  5. Rythu Bharosa : రైతు భరోసా.. ఉద్యోగులకు డిఏ.. ముహూర్తం ఫిక్స్..!

మరిన్ని వార్తలు