Rythu Bharosa : రైతులకు భారీ షాక్.. వారికి రైతుభరోసా కట్..!

Rythu Bharosa : రైతులకు భారీ షాక్.. వారికి రైతుభరోసా కట్..!
మన సాక్షి, తెలంగాణ :
కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం లో పలువురు రైతులు కట్ అయినట్లు తెలుస్తోంది. అయితే గుట్టలు, కొండలు సాగుకు యోగ్యం కానీ భూముల వివరాలను సేకరించిన ప్రభుత్వం లబ్ధిదారులు సాగు చేస్తున్న వారికే రైతు భరోసా జమ చేశారు. కాగా వారిలో గత ప్రభుత్వం కంటే రైతులు తగ్గినట్లు తెలుస్తోంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కంటే ప్రస్తుతం 3,94,232 మంది రైతులకు కోత పెట్టినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎకరం వరకు ఉన్న రైతులు 22,55,181 ఉండగా 12 లక్షల 85 వేల 147 ఎకరాలకు గాను 642.57 కోట్ల రైతుబంధు ఇచ్చారు.
కాగా కాంగ్రెస్ సర్కార్ ప్రస్తుతం ఎకరం వరకు ఉన్న రైతుల జాబితాలో 18,60, 949 మంది రైతులకు 12,21,820 ఎకరాలకు 610.91 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేసింది.
అయితే రైతు భరోసా కు కూడా ఎలాంటి పరిమితి లేకుండా నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఎకరంలోపు ఉన్న రైతులు 3.94 లక్షల మంది రైతులకు కోత పెట్టినట్లు సమాచారం.
● రిలేటెడ్ న్యూస్ :
Rythu Bharosa : రైతు భరోసా మళ్లీ ఎప్పుడంటే.. డేట్ ఫిక్స్.. బిగ్ అప్డేట్..!
Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో పడలేదా.. అయితే ఇలా చేయండి..!
Rythu Bharosa : రైతు భరోసా.. 17.03 లక్షల మంది రైతు ఖాతాల్లో రూ.533 కోట్లు జమ.. చెక్ చేసుకోండి..!
Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో జమ.. ముందుగా వారికే.. బిగ్ అప్డేట్..!









