Miryalaguda : వేసవిలో తాగునీటి సరఫరాపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు..!
Miryalaguda : వేసవిలో తాగునీటి సరఫరాపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ మున్సిపాలిటీతో పాటు, గ్రామీణ ప్రాంతంలో వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మిర్యాలగూడ మున్సిపల్ అధికారులు, ఎంపీడీవోను ఆదేశించారు.
బుధవారం ఆమె మిర్యాలగూడ ఎంపీడీవో కార్యాలయంలో తాగునీటి సరఫరా పై ఎంపీడీవో, ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డివిజన్ వారిగా తాగునీటి పథకాలు, వనరులు,బోర్లు, నల్ల కనెక్షన్లు, మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న తాగునీరు, మరమ్మతులు , వేసవి కార్యాచరణ ప్రణాళిక తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు.
డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ పట్టణ ప్రాంత వార్డులలో ఎలాంటి తాగునీటి కొరత లేకుండా చర్య తీసుకోవాలని ఆన్నారు. ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమైతే తక్షణమే పరిష్కరించాలని ,వారి స్థాయిలో పరిష్కారం కానివి వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె సూచించారు.
తాగునీటి సరఫరాకై పంపులకు వినియోగిస్తున్న విద్యుత్తు వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు తాగునీటి పరిస్థితిని సమీక్షించాలని, మున్సిపల్ కమిషనర్‌ను, ఎంపీడీవోను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మిర్యాలగూడ మున్సిపల్ పరిధిలో డంపింగ్ యార్డ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఎంపీడీవో శర్మ, ఈఈ వెంకన్న, అసిస్టెంట్ ఇంజనీర్ మౌనిక తదితరులు ఉన్నారు.
MOST READ :
-
Smart Ration Cards : ATM సైజులో స్మార్ట్ రేషన్ కార్డులు.. మహిళల పేరుతోనే ఆ జిల్లాల్లో పంపిణీ..!
-
Phone : మీ ఫోన్ లోనే సింపుల్ సెట్టింగ్స్.. ఎవరూ చోరీ చేయలేరు, ఇలా చేస్తే చాలు..!
-
Phone : మీ ఫోన్ లోనే సింపుల్ సెట్టింగ్స్.. ఎవరూ చోరీ చేయలేరు, ఇలా చేస్తే చాలు..!
-
Phonepe : ఫోన్ పే లో కొత్త ఫీచర్.. మోసాన్ని నివారించవచ్చు..!









